సమస్య ఎక్కడ ఉందో అక్కడ జనసేన ఉంటుంది – పల్లెపోరులో బొలిశెట్టి

తాడేపల్లిగూడెం నియోజకవర్గం, పెంటపాడు మండలం, మీనవల్లూరు గ్రామంలో రెండవ రోజు పల్లెపోరులో భాగంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇక్కడ రోడ్లు వ్యవస్థ చూస్తుంటే దారుణమైన పరిస్థితులలో గ్రామ ప్రజలు ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎంచుకొని నాలుగు సవంత్సరాలు దాటినా ఏ గ్రామంలో అభివృద్ధి జరగలేదన్నారు. అధికారం రాకముందు ఇచ్చిన వాగ్దానాలు అధికారం వచ్చాక వైసీపీ ప్రభుత్వం పక్కకు పెట్టిందని బొలిశెట్టి అన్నారు. దాదాపు నాలుగున్నర ఏళ్లు కావస్తున్న ప్రజల సమస్యలను పట్టించుకోకపోగా పట్టణంలో, గ్రామంలో జగనన్న కాలనీలో అవకతవకలు జరిగాయని శ్రీనివాస్ అన్నారు. ఇకనుంచి ప్రతి సమస్యపై ప్రభుత్వంపై ఉద్యమం బావుటా ఎగురవేస్తామన్నారు. ఇసుక కొరత విద్యుత్ లైన్లు రహదారులు డ్రైనేజీల నిర్మాణం ఇలా ప్రతి మౌలిక సదుపాయల గురించి ప్రజల తరఫున ప్రభుత్వంపై తిరగబడతామన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, జిల్లా అధ్యక్షులు రామిశెట్టి సురేష్, యంట్రపాటి రాజు, మద్దాల మణికుమార్, కొనకళ్ళ హరినాథ్, అధికార ప్రతినిధి సజ్జసుబ్బు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ నాయకులు గుండుమోగుల సురేష్, నాల్లకంచు రాంబాబు, మాదాసు ఇందు, నీలపాల దినేష్, అడపా ప్రసాద్, చాపల రమేష్, జగత్ సోమశేఖర్, పిడుగు మోహన్ బ్రదర్స్, సోమ శంకర్, కురెళ్ళ శ్రీను, బయనపాలేపు ముఖేష్, దాగరపు శ్రీను, కాజూరు మల్లేశ్వరరావు, రుద్ర రమేష్, సోమశంకర్, షేక్ వలి, అడ్డగర్ర సురేష్, వీర మహిళలు పెంటపాడు మండల మహిళా అధ్యక్షులు పెనుబోతుల సోమలమ్మ, తాడేపల్లిగూడెం మండలం మహిళా అధ్యక్షులు గరగ విష్ణు ప్రియ, మధుశ్రీ తదితరులు పాల్గొన్నారు.