జనసేనాని స్పూర్తితో ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ బోధన

*జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తన వంతు బాధ్యతగా నియోజకవర్గ నాయకులు మేరుగు శివ కోటీ యాదవ్

నర్సంపేట, వృత్తి రిత్యా ఒక ఇంగ్లీషు ఉపాధ్యాయుడిగా తనకున్న అనుభవంతో నర్సంపేట నియోజకవర్గ జనసేన నాయకులు మేరుగు శివ కోటీ యాదవ్ పేద విద్యార్థులకు ఇంగ్లీషు భాష పరిజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో నర్సంపేటలోని “సంజీవని ఆశ్రమం పిల్లలకి ఉచితంగా” స్పోకెన్ ఇంగ్లీష్ బోధన తరగతులను” మే 1 తేదీ నుండి రోజు నుండి నలభై ఐదు రోజుల వరకు నిర్వహించదలచడం జరిగింది.ఈ సందర్భంగా శివ కోటీ యాదవ్ మాట్లాడుతూ… విద్య సామాన్యులకి అందుబాటులో ఉండాలి అనేది జన సేన ఆశయాలలో ఒకటి అని, అలాగే తనకి ఈ అవకాశం కల్పించిన మరియు ఎంతో మంది అనాద పిల్లలకి దేవునివలె ఆశ్రమం నిర్మించి, వారికి ఉన్నత విద్య అందిస్తూ వారిని ప్రయోజకులను చేస్తున్న మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎ.మోహన్ రావు కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు, అలాగే వారు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అన్నారు.