కబడ్డీ పోటీలలో 3వ స్థానంలో నిలచిన దమ్మాలపాడు టీం

సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెండు రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలలో దమ్మాలపాడు కబడ్డీ టీం మూడో స్థానాన్ని గెలుచుకున్నారు.
దమ్మాలపాడు కబడ్డీ టీం క్రీడాకారులను ప్రోత్సహించిన బొర్రా వెంకట అప్పారావుకి క్రీడాకారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలలో యువతీ యువతలను క్రీడల పరంగా ప్రోత్సహించాలని భవిష్యత్తులో వారు క్రీడారంగంలో అగ్రస్థానంలో రాణించాలని బొర్రా వెంకట అప్పారావు తెలిపారు.