యాత్రా-2 సినిమా పేరుతో హార్సిలీ హిల్స్ లో భూ దందా

  • ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

మదనపల్లె: యాత్రా-2 సినిమా డైరెక్టర్ కి హార్సిలీ హిల్స్ లో రెండు ఎకరాల భూమిని కేటాయించడంపై ప్రభుత్వ భూములను సినిమా డైరెక్టర్ కు కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను దారా దత్తం చేయటాన్ని మదనపల్లి నియోజకవర్గం అఖిలపక్షం తీవ్రంగా ఖండించిన జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట విపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి గారు మాట్లాడుతూ మదనపల్లి మీదుగా రైల్వే లైన్ ని రద్దు చేపించి, హంద్రీ నివా నీటిని మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నింపకుండా పుంగునూర్ కీ తరలిస్తు, మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా, బిటీ కళాశాలను ప్రభుత్వ పరం చేయలేని ఈ వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిచారు. వెంటనే జీవోని రద్దు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిరసనలు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గానికి చెందిన జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.