భైంసాలో ఏపీ సీఎం దిష్టి బొమ్మ దహనం

భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో బస్టాండ్ చౌరస్తాలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా వైఎస్ జగన్ దిష్టబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ, మోహన్, ముదోల్ తాలుక కన్వీనర్, బోయిడివిఠల్ జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ.. మాజీ ఎపి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎపి యువకుల స్కిల్ డెవలప్మెంట్ కోసం చేసిన పనిలో అవినీతి జరిగిందని, అనవసర రాద్దాంతం చేసి రాత్రికి రాత్రి అక్రమంగా అరెస్టు చేయడం ఎంత వరకూ సమంజసం అని వారు ఎద్దేవా చేసారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుణ్ణి పట్టుకొని ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం సరైన పద్దతి కాదు. వైఎస్ జగన్ నువ్వు అవినీతి, గుండా యిజం, అక్రమంగా డబ్బులు సంపాదించి జైలు పాలయై అందరినీ జైల్లో వేయడానికి కుట్ర పన్నుతు అడ్డ దిడ్డంగ ప్రజలను భయ బ్రంతులకు గురిచేసి అధికారంలోకి వచ్చావు. కాబట్టీ ఈ రోజు నుండి పరిస్థితులు మారాయి తెలుగుదేశం, జనసెన పార్టీలను ఎంత భయ పెట్టినా వెనకడుగు వేయం, మడం, తిప్పం మరింత బలపడుతాం. మీ నియంత దుర్మార్గపు పాలనపై కలిసి పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుబీర్ మండల అధ్యక్షులు రాందాస్, భైంసా పట్టణ అధ్యక్షుడు రాజు, ప్రకాష్, నారాయణ్, భోజన్న, జనసేన నాయకులు రామోజీ వార్, గంగ ప్రసాద్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు.