జీవో నెం.1 రద్దు హర్షణీయం.. పాలకొండ జనసేన

  • రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతిపక్షాల పైన కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

పాలకొండ: ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ ఒకటిని ఏపీ హైకోర్టు రద్దు చేయడం చాలా అభినందకరమైన విషయమని వీరఘట్టం జనసేన నాయకులు అన్నారు. పాలకొండ నియోజక వర్గం, వీరఘట్టం మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం, బి.పి. నాయుడు, జనసేన జానిలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మునుపేన్నడు లేని విధంగా ఈరోజు జీవో నెంబర్ ఒకటి తెచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా కక్ష సాధింపు చర్యలు పూనుకోవడం అన్యాయమని, అలాగే ఇలాంటి సందర్భంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా జీవో నెంబర్ తేవడం చాలా అన్యాయమని ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో సభలు, రోడ్ షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో నెం.1ను తీసుకు రావడం చాలా అన్యాయమని, ఈ జీవోపై జనసేన పార్టీ తో పాటు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద పోరాటాలు జరిగిన నేపథ్యంలో ఈరోజు జీవో నెంబర్ ఒకటిని రద్దు చేసే విధంగా ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడం చాలా శుభపరిణామని కావున ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతుల సమస్యలు పరిష్కరించాలి తప్ప, ఇలా జీవోలు మీద జీవోలు తెచ్చి వివిధ వర్గాల ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్ణేన సాయి పవన్, ప్రణీతలు పాల్గొన్నారు.