పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు: కౌన్సిలర్ గొలకోటి

అమలాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వాలంటీర్స్ ముసుగులో వైసీపీ నేతలు వక్రీకరించి మాట్లడుతూ అనవసరరాద్ధాంతం చేస్తున్నారు అని అమలాపురం పురపాలక సంఘ 9వ వార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకొటి విజయ లక్ష్మి విమర్శించారు. మంగళవారం విజయ లక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ వాలంటీర్ లు కొంతమంది చేసేలోపాలు, వాటి వలన మహిళలకు జరిగే నష్టాన్ని, వై.సి.పి నేతలు చేసే ఆకృత్యాలను మా నేత పవన్ కళ్యాణ్ ప్రస్తావించడంజరిగింది. ఏలూరు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు వై.సి.పి నేతలు సమాధానం ఇవ్వలేపోయారు. వాంటీర్లును అడ్డుపెట్టుకుని పవన్ దిష్టి బొమ్మలు అంటించడం దారుణమని, ప్రజలు మీ అరాచకం పాలన చూస్తునారని, వచ్చే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెబుతారని మీరు, మీ పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా ఎన్నికల్లో మీ ఓటమి ఖాయమిందని ప్రజలందరూ మిమ్మల్ని గద్దె దింపడం ఖాయమని, విజయవకాశాలు లేక పోవడంతో పవన్ కళ్యాణ్ ని ఎదుర్కొలేక, చవకబారు రాజకీయాలు చేస్తూ, అరాచకాలుసృష్టిస్టు న్నారని, కౌన్సిలర్ విజయలక్ష్మి విమర్శించారు.