ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయండి: మాతా గాయత్రి

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇచ్చిన ప్రకటన ప్రకారం గంట్యాడ నుంచి వచ్చే పైప్ లైన్స్ మరమ్మతులు జరుగుతున్నాయి. ఒకటో తారీకు నుంచి ఐదో తారీకు వరకు నీటి సరఫరా 38వ వార్డు 37వ వార్డు 47వ వార్డు 44వ వార్డు 43వ వార్డు 39వ వార్డు 42 వార్డు ఈ డివిజన్స్ కి నీరు అందట్లేదు. ఐదు రోజులు ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతుందని మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది. ఆరోజు ప్రకటన తర్వాత కూడా వాటర్ సరిగా రాకపోయినందున ఆయా డివిజన్స్ లో మున్సిపల్ వాటర్ రానందున ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లి డి.ఈ అప్పారావుకు, తక్షణమే వాటర్ ట్యాంకర్లు ద్వారా సప్లై చేయాలని జనసేన తరపునుంచి జనసేన నాయకురాలు మతా గాయత్రి ఆద్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎల్.రవితేజ, ఎర్నాగుల చక్రవర్తి, వంశీ, పవన్, మధు, భార్గవ, నవీను పాల్గొన్నారు.