పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలి: కౌన్సిలర్ హారిక

అమలాపురం: పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టండని జనసేన కౌన్సిలర్ గండి దేవి హరిక పేర్కొన్నారు. మంగళవారం హారిక విలేకరులతో మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థలో కొంతమంది చేసే లోపాలవలన మహిళలకు జరిగే నష్టాన్ని, వై.సి.పి దుండగుల ఆకృత్యాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావించడంతో వై.సి.పి వాలంటీర్ల ముసుగులో నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలని అమలాపురం పురపాలక 7వార్డు కౌన్సిలర్ గండి దేవి హారిక అన్నారు. ఏలూరు సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎదో మాట్లాడుతున్నారని అన్నారు. వీరు ఎన్ని ఎత్తులేసినా వైయస్సార్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ గద్దె దింపడం ఖాయమని దేవి హారిక అన్నారు.