క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

చింతపల్లి మండలం: స్థానిక గిరిజన భవన్ లో జనసేన పార్టీ నాయకులు అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య మరియు చింతపల్లి మండల ముఖ్యనాయకుల ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా మీడియా మిత్రులతో మాట్లాడుతూ ప్రస్తుతం గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మేము ప్రభుత్వాని నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నామన్నారు. అలాగే అనేక రంగాల్లో విఫలమైన ప్రభుత్వం రోజురోజుకీ ప్రజావ్యతిరేకతతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. గడిచిన నాలుగేళ్లలో గిరిజన నిరుద్యోగులు ఏమి కోల్పోయారో అందరికి తెలిసిందే ఇటీవలే ఉమెన్స్ అండ్ చిల్డర్న్ డెవలప్మెంట్ డిపార్ట్ మెంట్ లో తీసిన ఉద్యోగాలలో స్పష్టంగా జీవో నెం3 ఎఫెక్ట్ ఎలా తగిలిందో అందరికి తెలుసు. ఇలా అనేక రంగాల్లో గ్రామాభివృద్ధిలో ఉద్యోగ కల్పనలో ఇలా చాలా విషయాల్లో వైసీపీ ప్రభుత్వం అందరి ద్వారా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చివరికి మన ఆదివాసీ జాతి అస్తిత్వానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం చేసిన అతిగొప్ప మేలు ఏమిటంటే ఒక రాజకీయంగా, ఆర్థిక, విద్యాపరంగా బలమైన ఒక సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ఎస్టీ జాబితాలో చేర్చి అసలైన మన గిరిజన జాతి, భాషలు, సంస్కృతి, ఆచారాలు ప్రకృతి ఆరాధన వంటి అనేక రకమైన మన ఆదివాసీ మూలాలు నాశనం చెయ్యాలని పట్టుబట్టింది ఇది వాస్తవం కాదా? ఈ రకంగా అనేకరంగాల్లో ఆధివాసీలనుని మోసం చేయడమే కాకుండా ఈ ప్రాంత సహజ సంపద, ఖనిజ సంపదలను కొల్లగొట్టడానికి అనేక రకాలైన కుటిల ప్రయత్నాలు చెయ్యడం వాస్తవం కాదా?హైడ్రోపవర్ ప్రాజెక్ట్ వంటి ప్రకృతి విధ్వంసంతో కూడిన గిరిజన అస్తిత్వ నిర్ములానే వైసీపీ ప్రభుత్వం కాదా?అంటు తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, చింతపల్లి మండల నాయకులు ఉల్లి సీతారామ్, దేపురు రాజు, వంతల రాజారావు, వాలంగి పునీత్, శెట్టి స్వామి, కృష్ణమూర్తి, సాయి, అబ్బాయిదోర, గూడెం మండల అధ్యక్షులు కొయ్యం బాలరాజు, సిద్ధు, కోటేశ్వరరావు, ఈశ్వర్రావు, అశోక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.