పెదపలకలూరు గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

ప్రత్తిపాడు నియోజకవర్గంలో.. పెదపలకలూరు గ్రామంలో.. (40 వ డివిజన్) క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. రెండవ రోజు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు చేతుల మీదుగా వాలంటీర్ లను ఘనంగా సన్మానించి వారికి ప్రశంసా పత్రం అందజేసి.. అనంతరం క్రీయాశీలక సభ్యత్వ కిట్లును పంపిణీ చేయడం జరిగింది.

ఈ క్రియాశీలక కిట్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం, పార్టీ సిద్దంతాలు, పార్టీ భవిష్యత్ ప్రణాళికను పొందుపరచడం జరిగింది.

ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు రానున్న ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మణిక్యాలరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాధ్, గుంటూరు రురల్ మండల అధ్యక్షులు సురేష్, సతీష్, జనసేన నేతలు పతేళ్ల మల్లి, హుస్సేన్, సునీల్ మరియు పెదపలకలూరు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.