తెల్కపల్లి ఎస్ఐ ని సస్పెండ్ చేయాలి: జనసేన పార్టీ డిమాండ్

నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది.
తెలకపల్లికి చెందిన శివ (18) కమ్మారెడ్డిపల్లికి చెందిన బిందు(17) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ గురించి తెలిసిన బిందు కుటుంబ సభ్యులు ప్రియుడు శివని గతంలో హెచ్చరించారు. అయిన వీరి ప్రేమ వ్యవహారం లో మార్పు రాలేదు. కోపాన్ని పెంచుకున్న ప్రియురాలి కుటుంబ సభ్యులు జూన్ 6 తేదీన దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శివను నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా మహబూబ్ నగర్ కి రెఫర్ చేయడం జరిగింది. మరుసటి రోజు అక్కడి నుండి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ హాస్పిటల్ కి తీసుకువెళ్లగా.. చికిత్స పొందుతూ జూన్ 9న మృతి చెందాడు. ఈ సంఘటనపై శివ స్నేహితులు, కుటుంబ సభ్యులు తెల్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఎస్ఐ మాధవ రెడ్డి పట్టించుకోలేదు. పోలీసుల తీరును నిరసిస్తూ స్నేహితులు, కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. ప్రేమిస్తే చంపేస్తారా అంటూ శివ ఫ్యామిలీ కి న్యాయం చేయాలని ఫ్లకాడ్స్ తో జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఆదివారం చేరుకొని నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా జనసేన మరియు బి ఎస్ పి పార్టీ కి చెందిన పలువురు, శివ కుటుంబ సభ్యులు కలిసి డిఎస్పి ని కలిసి ఫిర్యాదు చేసి.. తక్షణమే విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని జనసేన పార్టీ తరపున రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు
నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ కోరారు.

కార్యక్రమంలో.. జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు ఎమ్. రెడ్డి. రాకేష్ రెడ్డి, జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పి. ఆర్. రాఘవేంద్ర, జనసేన పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జానీ, జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేందర్, జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ సూర్య, జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యులు లక్ష్మి నారాయణ, అన్వేష్ రెడ్డి మరియు నాగర్ కర్నూల్ జిల్లా యువ నాయకులు లింగం నాయక్ తదితరులు పాల్గొన్నారు…!