సూర్యాపేటలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ మేకల సతీష్ రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రామగిరి శివ సాయి ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న క్రియాశీలక సభ్యులకు 5లక్షల ఇన్సూరెన్స్ బీమా పత్రాలను అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ నెమ్మది వెంకటేష్ మరియు శంకర్, శంకర్ నాయక్, సఫీన్, గుడిసె గౌతమ్, తీగల శ్రవణ్, ఆకాష్ జనసైనికులు పాల్గొన్నారు.