బిజినపల్లి మండలంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర

• హామీలు మాటలకే కానీ ఆచరణలోకి రావడం లేదు
• పాలన మారితే తప్ప నియోజకవర్గం అభివృద్ధి చెందదు
• అల్లిపుర్ గ్రామస్థులు

నాగర్ కర్నూల్, పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా రెండవ విడత కార్యక్రమంలో భాగంగా బిజినపల్లి మండలం అల్లిపుర్ గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ శనివారం పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులతో కలిసి, జనసైనికులతో కలిసి పాదయాత్రగా గ్రామంలో పర్యటించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజలు వారి సమస్యలను వంగ లక్ష్మణ్ గౌడ్ కి విన్నవించుకున్నారు. అదేవిధంగా ప్రజలు ఎమ్మేల్యేకి మా అల్లిపుర్ గ్రామం కేవలం ఓట్ల సమయంలోనే కనిపిస్తుందా.? ఓట్ల కోసం మాత్రం మా గ్రామంలో ప్రతి వీధి, వీధి, ప్రతి గడప తిరిగి ఓటేయండి, మీకు ఇళ్ళు ఇస్తాం, పించన్ ఇస్తాం, అన్ని కబుర్లు చెప్పారు. ఇప్పుడెక్కడ పోయారు..? మా గ్రామంలో రోడ్లు సరిగ్గా లేవు, మోరిలు లేవు, చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళ మధ్య కాల్వలు లేవు, రోడ్లు అన్ని గుంతలు మిట్టలు, ఎందుకీ పాలన..? ఎందుకీ వేదన..? అంటూ వంగ లక్ష్మణ్ గౌడ్ తో కలిసి గ్రామస్థులు ప్రభుత్వంపై, నియోజకవర్గ పాలనపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మరియు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మార్పు మీ నుంచే మొదలవ్వాలి అని కోరుకుంటున్నాం అంటూ ప్రజలు వంగ లక్ష్మణ్ గౌడ్ ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు జస్టిన్ బాబా, భోట్కా రమేష్, మూర్తి నాయక్, రాజు నాయక్, వంశీ రెడ్డి, సూర్య, లింగం నాయక్, రాకేష్, రమేష్, స్వామి, పవన్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

• మమ్మాయిపల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర

శనివారం సాయంత్రం మమ్మాయిపల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులతో కలిసి వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్రగా గ్రామంలో పర్యటించి గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు జస్టిన్ బాబా, భోట్క రమేష్, మూర్తి నాయక్, రాజు నాయక్, సూర్య, వంశీ రెడ్డి, లింగం నాయక్, రాకేష్, పవన్, పవన్ కుమార్, స్వామి, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.