సీతంపేట జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, సీతంపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యుల భీమా పధకం కిట్లు పంపిణీ శనివారం ఉదయం 9 గంటలకు క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు జనసేన పార్టీ స్టేట్ సెక్రెటరీలు బేతపూడి విజయ్ శేఖర్, అంగ దుర్గా ప్రశాంతి, జాయింట్ సెక్రెటరీ తాడి మోహన్ ఆధ్యర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీతంపేట మండల నాయకులు కుండింగి శ్రీకాంత్, ఉపేంద్ర అధ్యక్షతన క్రియాశీలక సభ్యులకు క్రియాశీలక కిట్లు పంపిణీ చేయడం జరిగింది..
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మనోగతాన్ని వినిపించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం బాధ్యతలు తెలియజేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వ వస్తుందని, దానికోసం క్రియాశీలక సభ్యులు అందరూ తమ వంతు కృషి చేయాలని సీతంపేట నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు గణేష్, హరీష్, శ్రీను, చంద్రయ్య మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.