కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలి

  • తుడాలో ఉన్నది తిరుపతిలో ఉంటే బాగుంటుంది
  • జనసేన ఇంచార్జ్ యుగంధర్

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో 24 గంటలు నిరాహార దీక్ష, కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలుపుట కొరకు నిర్వహించడం జరిగింది. ఆర్కే వీబిపేట గ్రామపంచాయతీ ఆర్కే విపి పేట గ్రామంలో ఉదయం 7.00 నుండి 8.00 వరకు, టీకేఎం పేట గ్రామపంచాయతీ, టీ కే ఏం పేట గ్రామంలో ఉదయం 8.30 నుంది 9.30 వరకు, సీడీ కండ్రిగ గ్రామ పంచాయతీ, సీడి కండ్రిగ గ్రామంలో, ఉదయం 10.00 నుండి 11 గంటల వరకు. కత్తెర పల్లి పంచాయతీ, కత్తెర పల్లి గ్రామంలో,ఉదయం 11.30 నుండి 12.30 వరకు, ఆలత్తూరు పంచాయతీ, కొత్తూరు గ్రామంలో, మధ్యాహ్నం 1.00 నుంది 2.00 వరకు, ముక్కర వారి పల్లి పంచాయతీ, ముక్కర వారి పల్లి గ్రామంలో, మధ్యాహ్నం 2.30 నుండి 3.30 వరకు కొల్లాగుంట పంచాయతీ, కొల్లాగుంట ఏ ఏ డబ్ల్యు గ్రామంలో, మధ్యాహ్నం 4.00 నుండి 5.00 వరకు., గోపీసెట్టి పల్లి పంచాయతీ, ఈదువారి పల్లి గ్రామంలో, సాయంత్రం 5.30 నుండి 6.30 వరకు. కొట్టార్వేడు గ్రామ పంచాయతీ, కొట్టార్వేడు గ్రామంలో, సాయంత్రం 7.00 నుండి 8. 00 వరకు, కేయం పురం పంచాయతీ, కేయం పురం లో, సాయంత్రం 8.30 నుండి ఉదయం 7 గంటల వరకు, రాత్రి ఇదే గ్రామం లోనే బసతో నిరాహార దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా కారు వేటినగరం మండలానికి అన్యాయం జరగకూడదని, ప్రజా సంక్షేమమే ప్రధమ ధ్యేయంగా, యువతకు న్యాయం జరగాలని, రైతులకు న్యాయం జరగాలని, తిరుపతిలో కలపడం ద్వారా ఇది తప్పక జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఆరంభం మాత్రమే ముగింపు చాలా అద్భుతంగా ఉందని, అదే కార్వేటి నగర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం అని ఉద్ఘటించారు. తుడా పరిధిలో ఉన్న కార్వేటి నగరం మండలం తిరుపతిలో కలపడమే న్యాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల ప్రధాన కార్యదర్శిలు దేవా, హరీష్, ఉపాధ్యక్షులు విజయ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యక్షులు వెంకటేష్, కార్వేటినగరం మండల యువజన అధ్యక్షులు నరసింహులు, కార్వేటి నగర్ మండల ఉపాధ్యక్షులు శ్యాము, గ్రామస్తులు, జనసైనికులు పాల్గొన్నారు.