కారూరు గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, పిచాటుర్ మండలం, కారూరు గ్రామంలో జనసేన పార్టీ తరపున ఎస్టీ కాలనీ నందు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తడ శ్రీనివాసులు, మండల నాయకుడు సుగంధర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోదండ రామయ్య, మారైయ్యా, గాంధీ, చంద్రు, అగస్తీన్, సుబ్రమణ్యం, ప్రకాష్, మనోవ అమృత్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.