రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబానికి ఆనూరు జనసైనికుల ఆర్థిక సహాయం

  • పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ చేతుల మీదుగా పంపిణీ

పెద్దాపురం మండలం ఆనూరు గ్రామానికి చెందిన మైలవరపు వెంకటరమణ కుటుంబం గురువారం సాయంత్రం వెంకటరమణ తమ కొడుకును కాలేజీలో జాయిన్ చేసే నిమిత్తం వెళ్లి తిరిగి వస్తున్న తరుణంలో రామేశ్వరం పేట దగ్గర్లో ప్రగతి కాలేజ్ దగ్గర మీరు ప్రయాణిస్తున్న బండిని రాజమండ్రి నుండి కాకినాడ వస్తున్న కారు అతివేగంగా ఢీకొట్టింది ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి భార్య భర్తలకు రెండు కాళ్లు విరిగిపోవడం జరిగింది. పిల్లోడికి బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టిందని వెంటనే ఆపరేషన్ చేయాలి అని లక్షా 50 వేల రూపాయలు డాక్టర్లు అవుతుందని తెలిపారు, దీనికి స్పందించిన ఆలూరు గ్రామంలో జనసైనికులు తమ వంతు సహాయంగా 31,000 ఆ కుటుంబ సభ్యులకు పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి(బాబు) చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆనూరు జనసైనికులు మాట్లాడుతూ సమస్య ఎక్కడ ఉన్నదో అక్కడ జనసేన పార్టీ ఉంటదని పవన్ కళ్యాణ్ ఆశ సాధనం కోసం మా వంతుగా మేము మా పరిధిలో మాకు తోచినంత సహాయం చేశామని ఎవరికి కష్టం జరిగిన మేము అందరం కలిసికట్టుగా ఉండి వారి సమస్యలను తీరుస్తావని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ ఆనూరు జనసైనికులు చేసిన పని చాలా అభినందనీయమని ఇది ఏ పార్టీ కార్యకర్తలకు చేయలేనటువంటి పని ఒక జనసేన పార్టీ కార్యకర్త చేయగలరని అది తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయసాధననుంచే పుట్టుకు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కొప్పిరెడ్డి నాగబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు, సుంకర కృష్ణవేణి, మలిరెడ్డి బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.