బిక్కవోలు జనసేన ఆధ్వర్యంలో చల్లని బట్టర్ మిల్క్ పంపిణీ

అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, బిక్కవోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డొక్కా సీతమ్మ చలివేంద్రంలో 2వ రోజు కార్యక్రమంలో భాగంగా బిక్కవోలు గ్రామ అధ్యక్షుడు తోట సతీష్ కుమార్ (మసాలా పండు) చల్లని బట్టర్ మిల్క్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో మండల యువత అధ్యక్షుడు గుత్తుల శివ కొండబాబు, సోషల్ మీడియా కన్వీనర్ నూతంగి ప్రసాద్, గ్రామ నాయకులు వడ్లమూడి గోవిందరాజులు, సతీష్, కర్రి శీను తదితరులు పాల్గొన్నారు.