విద్యార్థుల్ని బహిరంగ సభలకు తరలించడం దుర్మార్గమైన చర్య: కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాకు విచ్చేసి, నార్పల బహిరంగ సభలో వసతి దీవెన పథకాన్ని ప్రారంభిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విద్యార్థులతో, నాయకులతో గొప్పలు చెప్పించుకుని పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ బహిరంగ సభకు ఎస్.కే.యు విద్యార్థులని, జె.ఎన్.టి.యు విద్యార్థుల్ని, అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరినీ బలవంతంగా తరలించి విద్యార్థులకు సరైన వసతులు కల్పించకుండా ఒకరిద్దరు అస్వస్థకు గురవడం జరిగింది. విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్న దశలో విద్యార్థుల పరీక్షా కాలంలో మరీ ముఖ్యంగా పరీక్షలను అనంతపురం జిల్లాకు చెందిన విద్యాశాఖ అధికారులు వాయిదా వేసి విద్యార్థుల్ని బహిరంగ సభలకు తరలించడం దుర్మార్గమైన చర్య. యూనివర్సిటీలకు చెందిన విసిలు, విద్యాశాఖ అధికారులు అందరూ వైసిపి కార్యకర్తల్లాగా ప్రవర్తించడం సిగ్గుచేటు. వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి దగ్గర నుంచి వైసిపి నాయకులందరికీ సరైన ఇంగిత జ్ఞానం లేకుండా విద్యార్థుల ముందర రాజకీయాలు ప్రస్తావన చేయడం. ప్రతిపక్షాలను విమర్శించడం నీచమైన హేయమైన చర్య జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ద్రోహని ఈ సభ ద్వారా మరొక మారు నిరూపించుకున్నారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించలేదు, కనీసం ఎన్నికల తరంలోనైనా జిల్లాకు లబ్ధి చేకూరుస్తారనుకుంటే ఏమీ చేకూర్చకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతపురం కరువు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వైసిపి నాయకులు అనంతపురం జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సాధించడంలో పూర్తిగా విఫలమైనారు అని ఈ బహిరంగ సభ ద్వారా తేటతెల్లమైపోయిందని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.