జనసేనపార్టీ స్టేట్ డాక్టర్స్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు ఆధ్వర్యంలో కరోనా కిట్ల పంపిణీ

ఉత్తరాంధ్ర జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ స్టేట్ డాక్టర్స్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు ఆధ్వర్యంలో కరోన విపత్కర కాలంలో ప్రజాసేవే కాకుండా ఆరోగ్యం కోసం కూడా జనసేనపార్టీ ఎప్పుడు ముందు ఉంటుందని తెలియజేసారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పెద్దలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివ శంకర్, జనసేన పార్టీ పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.