సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న డాక్టర్. యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, ఆర్.కే.వీ.బీ పేట పంచాయతీ పరిదిలో ఇందిరా కాలనీనందు జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బహుమతుల ప్రధానోత్సవం జనసేన నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న చేతులమీదుగా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులుశోభన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల బూత్ కన్వీనర్ అన్నామలై, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.