ముస్లిం మైనారిటీ నాయకుల రిలే నిరాహారదీక్షకు జనసేన సంఘీభావం

  • జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలిపిన గుంతకల్లు నియోజకవర్గం నాయకులు అరికేరి జీవన్ కుమార్

గుంతకల్లు నియోజకవర్గం: ముస్లిం మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్షకు జనసేన పార్టీ తరపున గుంతకల్లు నియోజకవర్గం నాయకులు అరికేరి జీవన్ కుమార్ మద్దతు తెలపడం జరగింది. ఈ సందర్భంగా అరికేరి జీవన్ కుమార్ మాట్లాడుతూ.. ఈ వైసీపీ ప్రభుత్వం ముస్లిం సోదరులను కేవలం ఓటు బ్యాంక్ గానే చూస్తుందని, అభివృద్ధి అంటే ఆమడ దూరంలో ఉంటుంది అని, గుంతకల్లు పతణంలో మైనారిటీ బాలికల కాలేజ్ & హాస్టల్ నాటి ప్రభుత్వ హయంలో 4 కోట్ల రూపాయలతో భవన నిర్మాణం పూర్తి చేశారు. అన్ని తర్వాత ఎన్నికలు వచ్చి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన ప్రారంభానికి నోచుకోకపోవడం ఈ వైసీపీ ప్రభుత్వం ముస్లిం సోదరుల పట్ల చూపిస్తున నిబద్ధత అర్తం చేసుకోగలరు అన్ని వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత జనసేన పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ముస్లిం మైనారిటీల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా అండగా నిలుస్తుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంతకల్లు నియోజకవర్గం మైనారిటీ నాయకులు షేక్ జిలన్ బాషా, 1వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి హెన్రీ పాల్ (ఎల్ ఎల్ బి), యువ నాయకులు తాడిపత్రి మహేష్ కుమార్, అరవింద్ రాజా, చిన్న, మారుతి కుమార్ యాదవ్, ఆర్.సి సురేష్ కుమార్ (ఎల్ ఎల్ బి) తదితరులు పాల్గొన్నారు.