మేడిశెట్టి సూర్యకిరణ్(బాబి) ఆధ్వర్యంలో జనసేన సభత్వ కిట్ల పంపిణీ

ప్రత్తిపాడు నియోజకవర్గం, మేడిశెట్టి సూర్యకిరణ్(బాబి) ఆధ్వర్యంలో ప్రత్తిపాడు మండలం శరభవరం గ్రామంలో జనసేన క్రియాశీల సభత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో జనసేన సభ్యత్వాలు 70 పైన చేసిన అమరాది శివని మేడిశెట్టి సూర్యకిరణ్ అభినందించారు. అనంతరం మేడిశెట్టి సూర్యకిరణ్ మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం మరింత పుంజుకుందని, ప్రతి ఒక్క జనసైనికుడు రానున్న రోజుల్లో మరింత కష్టపడి పని చేస్తే మనదే గెలుపు తధ్యం అని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న జనసేన పోరాట యాత్ర గురించి ఇంటింటికి తిరిగి వివరించాలని తెలిపారు. అలాగే “నా సేన కోసం నా వంతు” లో భాగంగా మీకు తోచినంత ఆర్ధిక సహాయాన్ని జనసేన పార్టీ తెలిపిన ఫోన్ నెంబర్ కి మీ విరాళాలు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, శంఖవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్, కత్తిపూడి గ్రామ అధ్యక్షులు పోసిన శ్రీను, శంఖవరం మండల కార్యదర్శి కొయ్యా శ్రీను, బొజ్జా చిన్న, నాగారపు రాజు, జీలకర్ర శ్రీను, మధు, బుర్ర రాజా, రాసంశెట్టి గణేష్, దూళ్ల బాలు, అమరాది దుర్గ ప్రసాద్, రాసంశెట్టి వీరబాబు, అమరాది వీరబాబు, అమరాది రాజా, మహదాసు వీరబాబు, ఎలుబండి అశోక్, ఎలుబండి సతీష్, అమరాది నాగేంద్ర, దూళ్ల రాజా, నరాలశెట్టి స్వామి నాయుడు, అమరాది దొరబాబు, అమరాది వెంకటరమణ, ముద్దా రవి, రామదేవు వెంకటరమణ, దాసం సురేష్, తుమ్మలపల్లి గంగాధర్, ఈగల శ్రీనివాసు, చామర్తి రమేష్, మాణిక్యాలు, అమరాది కృష్ణ, కుంపట్ల దొరబాబు, రంగనాధం విజయ్, అడపా మణికంఠ, రంగనాధం చిన్న, ధనేకుల ఈశ్వరరావు మరియు శరభవరం గ్రామ జనసైనికులు అధికంగా పాల్గొన్నారు.