రామకుప్పంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కుప్పం నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ క్ళ్యాణ్ ఆదేశాల మేరకు శనివారం మధ్యాహ్నం 1 గంటలకు అధిష్టానం ఆదేశాల మేరకు జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.హారిప్రసాద్ మరియు కుప్పం నియోజకవర్గ ఇంచార్జి డా.వెంకటరమణ పర్యవేక్షణలో జిల్లా కార్యదర్శి కె.రామమూర్తి, జిల్లా సంయుక్త కార్యదర్శులు వేణు మునెప్ప ల ఆధ్వర్యంలో రామకుప్పం మండల అధ్యక్షులు హరీష్ అధ్యక్షతన రామకుప్పం మండల కేంద్రంలోని పార్టీ ఆఫీస్ నందు క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లకు సన్మానం మరియు కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రామకుప్పం మండల నాయకులు, రఘురామ్, పవన్, శ్రీకాంత్, భాస్కర్, వినోద్, సురేష్ బాబు, సురేష్, షాహీన్ షా, సుబ్రహ్మణ్యం పాల్గొనడం జరిగింది.