బొడ్లపాడు గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, బొడ్లపాడు గ్రామంలో జనసేన జానీ జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చెయ్యడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామ సమస్యలపై మాట్లాడుతూ.. గ్రామ దేవత గుడికి వెళ్ళడానికి సరైన రహదారి లేక గ్రామంలోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలాగే ఊర్లో కేవలం మూడు కుళాయి పైపులు ఉన్నాయి.. నీళ్ల ట్యాంక్ ఒకటి ఉంది గాని అవి కేవలం చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నాయి తప్ప.. వాస్తవానికి నీరు రావడం లేదు. ఈ కారణంగా గ్రామంలో నీళ్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా.. అధికారులను కోరుతున్నారు.. కానీ మా గ్రామ పరిస్థితి మారడం లేదు.. నేను గత ఎలక్షన్లో జనసేన ఎంపిటిసి అభ్యర్థిగా పోటీ చేశాను.. నాపై గెలిచిన వ్యక్తి ఈ రోజుకి మా ఊరు ఎక్కడ ఉందో కూడా తనకు తెలియదు. పంచాయతీ ప్రెసిడెంట్ కూడా మా గ్రామానికి ఏం చేయలేదు.. మా ఊర్లో సమస్యలను స్థానిక లీడర్లు.. గెలిచిన ఎంపిటిసి, పంచాయతీ ప్రెసిడెంట్ పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు. మా ఊరు అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది.. అని జనసేన జానీ ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్లు కూడా హాజరవ్వడం జరిగింది.