తుమ్మలచెరువు గ్రామంలో నూతన గ్రామ కమిటీ మరియు సభ్యత్వ కిట్లు పంపిణీ

గురజాల నియోజకవర్గం: పిడుగురాళ్ల మండలం, తుమ్మలచెరువు గ్రామంలో నూతన గ్రామ కమిటీ నియామకం మరియు సభ్యత్వం క్విట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ.. పిడుగురాళ్ల మండలంలో ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం దశగా ముందుకెళ్తున్నామని, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు గారి సూచన మేరకు ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలతోపాటు బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నామని, రాష్ట్రంలో ఏ పార్టీకి లేని యువత ఈరోజు జనసేన పార్టీకి ఉన్నారని, అందులో భాగంగా యువతకు పెద్దపీట వేస్తూ.. గ్రామ కమిటీలో స్థానం కల్పించామని తెలియజేశారు. రాబోయే రోజుల్లో తుమ్మలచెరువు గ్రామంలో పార్టీ బలోపేతం దిశగా కమిటీ పని చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, మండల ప్రధాన కార్యదర్శి ఆవుల రమేష్, జానపాడు గ్రామ అధ్యక్షుడు పసుపులేటి నరసింహారావు, కార్యదర్శులు కండేపూడి వంశీ, గుడి రత్తయ్య, జానపాడు గ్రామ ప్రధాన కార్యదర్శి అంబటి సాయి, గ్రామ ఉపాధ్యక్షులు తాడువాయి రామకృష్ణ, జనసేన నాయకులు బేతంచర్ల ప్రసాద్, నూతి సూర్యనారాయణ, తోటా రామదాసు, తుమ్మలచెరువు గ్రామ జనసేన నాయకులు, కొమ్మ అశోక్, తమ్మిశెట్టి నాగేంద్రబాబు, కార్యవర్గ సభ్యులతో పాటు, కార్యకర్తలు, మొదలగు వారు పాల్గొన్నారు.