కడియాల వారి వివాహానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన బండారు శ్రీనివాస్

  • నూతన వధూవరులు సాయికృష్ణ-భువనేశ్వరి జంటను ఆశీర్వదించిన జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం నందు ఆలమూరు గ్రామంలో గురువారం కడియాల వీర వెంకట సత్యనారాయణ( శ్రీను) విజయ రత్నం దంపతుల ఇంట అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులుగా కొత్తపేట నియోజకవర్గం జనసేన రథసారధి, జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ జనసేన ప్రముఖ నాయకులు ఆలమూరు గ్రామంలో కడియాల వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా విచ్చేసి నూతన వధూవరులను దీవించి ఉన్నారు. వీరి రాక సందర్భంగా పలువురు బీసీ ప్రముఖలు, నాయకులు జనసేన నేతలు, పలువురు పార్టీ ప్రముఖ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు వారికి ఆత్మీయ స్వాగతం పలికి ఎంతో మర్యాదపూర్వకంగా ఈ సందర్భంగా సమావేశమయ్యారు. కడియాల వారి నూతన వధూవరుల సాయికృష్ణ- భువనేశ్వరి జంటను దీవించి ఆశీస్సులు అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల ప్రముఖ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్ రాజు, మూలస్థానం ప్రముఖ నాయకులు సలాది జయప్రకాష్ నారాయణ జెపి, ఆలమూరు జనసేన అధ్యక్షులు కట్టా రాజు, సిరిగినీడి పట్టాభి, చల్లా వెంకటేశ్వరరావు, చల్లా బాబి, దాసి మోహన్, ఆలమూరు మండల సీనియర్ నాయకులు కొత్తపళ్లి నగేష్, కోట వరలక్ష్మి, పడమట గణేష్, తదితరులు పాల్గొన్నారు.