గుంటూరు పట్టణ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తల సమావేశం

గుంటూరు: గుంటూరు పట్టణంలోని ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో వున్న 16, 26, 27, 40, 41, 46, 47, 48 డివిజన్లు అధ్యక్షులతోటి, మరియు జనసైనికులతోటి గుంటూరు పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో 8 డివిజన్ల సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశానికి గుంటూరు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ అధ్యక్షత వహించినారు. ముందుగా నేరేళ్ళ సురేష్ డివిజన్ అధ్యక్షులను, కార్యకర్తలను రామాంజనేయులుకి పరిచయం చేసినారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త కోర్రపాటి నాగేశ్వరరావు మరియు ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బూర్లె రామాంజనేయులు, పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త వడ్రాణం మార్కండేయ బాబు హాజరైనారు. ఈసందర్భంగా నేరేళ్ళ సురేష్ 8 డివిజన్ల అధ్యక్షులను రామాంజనేయులుకి పరిచయం చేసినారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ.. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఉన్న ఈ 8 డివిజన్ల పరిధిలోని అధ్యక్షులు ప్రతి డివిజన్ లోని తెలుగుదేశం పార్టీ వారు మరియు జనసేన పార్టీ వారు ముఖ్య నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోని ఆ డివిజన్లో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం తోటి ఇరువురు కలిసి రెండు పార్టీల మానిఫెస్ట్, మరియు విధివిధానాలను ప్రజలకు వివరించి ప్రజలను చైతన్యపరిచే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టి సమన్వయకర్త కోర్రపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అన్ని డివిజన్లలో ప్రస్తుతం ఓటర్ లిస్టులో వున్న తప్పొప్పుల వెరిఫికేషన్ మరియు నూతన ఓటర్లుగా నమోదు కార్యక్రమంలో జనసైనికులు చాలా బాగా పనిచేస్తున్నారని అన్నారు. పొన్నూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ డివిజన్ల పరిధిలోని అన్ని సమస్యలను అవగాహన చేసుకొని ప్రజల ఇబ్బందులకు పరిష్కారమార్గం చూపే విధంగా మన జనసైనికులు చర్యలు తీసుకోవాలని కోరినారు. పట్టణ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు, జనసైనికులు కలిసికట్టుగా ముందుకు నడవాలని ఏలాంటి ఓడుదోడుగులు లేకుండా విజయమే లక్ష్యంగా చేసుకుని ప్రయాణం చేయాలన్నారు. రానున్న ఈ ఎన్నికల సమరంలో శక్తి వంఛన లేకుండా కృషి చేయాలని సురేష్ గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు జిల్లా ఆధికార ప్రతినిధి ఆళ్ళ హరి, గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, కార్పొరేటర్లు శ్రీమతి దాసరి లక్ష్మి దుర్గ, శ్రీమతి యర్రంశెట్టి పద్మావతి, డివిజన్ల అధ్యక్షులు వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.