మీ ఓటు హక్కు దుర్వినియోగం చెయ్యొద్దు..!: వంపురు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం, డేగలవీధి గ్రామంలో జనసేన నాయకులు పర్యటించారు. గ్రామ ప్రజలతో సమావేశమౌతూ.. గ్రామస్తులు ముందుగా పంచాయితీ పరిధిలో గల రోడ్లు, డ్రైనేజి, పంటకాలువలకు సంబంధించిన సమస్యలు పాడేరు, అరకుపార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ వంపురు గంగులయ్య కు వివరించారు.. జనసేన పార్టీ ఇంచార్జ్ గంగులయ్య మాట్లాడుతూ.. మన ఓటుహక్కు తో ప్రజాస్వామ్యాన్ని నిర్దేశించుకునే దేశం మనది. ఈ ఓటుని డబ్బులకు అమ్ముకుని మన అభివృద్ధిని మనమే కాలరాస్తున్నాం. ఇప్పటివరకు మన ఓట్లతో ప్రజాప్రతినిధులుగా గెలిచిన నాయకులకు మన సమస్యలపై కనీస అవగాహన లేదు. మండల కేంద్రానికి పట్టు మని పది కిలో మీటర్ల దూరం లేని ఈ గ్రామం రోడ్డు చూస్తే అర్థమౌతుంది. ఇప్పటికైనా ప్రజలు చైతన్యవంతమైన రాజకీయాల వైపు ఆలోచన చెయ్యడం మంచిది. ప్రస్తుతం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ముందస్తుగా ఎందుకు ప్రకటించరు? ప్రకటించే సమయానికే దళారుల చేతికి పంట చేరిపోతుంది. పరోక్షంగా మద్యవర్తులకు సహకరిస్తున్నారు. జీసీసీని నిర్వీర్యయం చేశారు. డబ్బులేని గిరిజన సంస్థగా మార్చేశారు. గిరిజన అభివృధ్ధికోసం ఐ.టి.డి.ఎ. ప్రజాప్రతినిధులున్నారు. కానీ వారి మొదటి కర్తవ్యమే మరిచారు. దేశం బాగుపడాలంటే గ్రామసీమలు ముందు అభివృద్ధి చెందాలి. కానీ పంచాయితీ అభివృధ్ధికోసం నిధులు లేవంటారు. సర్పంచ్ అధికారాలకు తిలోదకలిచ్చారు.. ఇంకెక్కడ పంచాయితీ అభివృద్ధి జరుగుతుంది. రక రకాల కారణాలు చెబుతూ వృద్ధాప్యపు పింఛన్ తీసేస్తున్నారు, రేషన్ కార్డ్ లు రద్దు చేస్తున్నారు ఇదెక్కడి న్యాయం..?. అందుకే ప్రజలు నీతి, నిజాయితీగా గిరిజనాభివృద్ధికి కట్టుబడే పార్టీకి అండగా నిలవాలని కోరుతున్నాము. దశాబ్దాల తరబడి ఇంకా మన గ్రామసీమలు సరైన రవాణా వ్యవస్థ కూడా లేకుంటే అందుకు మన స్వీయ తప్పిదమే కారణం. మన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే మన అభివృద్ధిని కాంక్షించవచ్చు. గతంలో గిరిజన హక్కుల కొరకు పోరాటాలు చేసాం, ఇకపై కూడా పోరాటం అనివార్యమని జనసేన పార్టీ ద్వారా పోరాటానికి సిద్ధపడ్డాం. మొత్తానికి గిరిజనాభివృధ్ధికోసం పోరాటం ఆపే ప్రసక్తే లేదు. జనసేన పార్టీ తరుపున ఈ సమావేశం సందర్బంగా మేము మీకు ఒక విషయం తెలపాలనుకుంటున్నాం.. మేము వచ్చింది మాకు ఓటు వేయమని అడగడానికి కాదు!.. మీ ఓటు హక్కు దుర్వినియోగం చెయ్యొద్దు!.. ఆ ఫలితం భవిష్యత్ తరాలపైన పడుతుంది. ఎప్పుడైతే మనం ఓటును అమ్ముకుంటామో అప్పుడే మన గ్రామసీమల అభివృద్ధి కుంటుపడినట్టే..! ఈ విషయాన్ని నిజాయితీగా తెలియజేస్తున్నాం జనసేన పార్టీ నిజాయితీగా రాజకీయాలు చేస్తుంది. ప్రజలు గమనిస్తూనే ఆదరిస్తున్నారు. డేగల వీధి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇకపై మార్పుని కాంక్షించే రాజకీయాలను స్వాగతించాలని గిరిజనా సర్వతోముఖాభివృద్ధికి తమవంతుగా సహకారం అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు పాంగి సూర్యారావు, నందోలి బాబూరావు, పల్లిబొయిన చిన్నారవు, గోరపల్లి విశేశ్వరావు, నందోలి రాంబాబు, కిల్లో చిట్టిబాబు, గోరపల్లి ప్రసాద్, రెగం రాధాకృష్ణ, మహిళలు, రేగం సోములమ్మ, దూరు రత్నాలమ్మ, పాంగి చెల్లమ్మ, నందోలి సోములమ్మ, గోరపల్లి నేలమ్మా, జనసేన ప్రచార కార్యదర్శి పాంగి వెంకటేష్, మండల అధ్యక్షులు నందోలి మురళి, ఉపాధ్యక్షులు సాలేబు అశోక్, సంతోష్, షణ్ముక్, తదితర జనసైనికులు, మహిళలు పాల్గొన్నారు.