రైతుల త్యాగాలను అమ్ముకోవద్దు…. జనసేన నేత బొబ్బేపల్లి

సర్వేపల్లి నియోజకవర్గంలోని కృష్ణపట్నం పోర్ట్ కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణం కోసం 19 వేల కోట్ల ప్రజాధనం చిన్న సన్నకారు రైతులు ఇచ్చినటువంటి 15 వందల ఎకరాలతో నిర్మితమైన జెన్కో పవర్ ప్లాంట్ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటి విడత రెండు గ్రిడ్లను 1600 మెగావాట్లతో ప్రారంభించడం జరిగింది. ఆ తరువాత నారా చంద్రబాబు నాయుడు, హయాంలో 800 మెగావాట్లతో మూడవ గ్రిడ్ ని ప్రారంభించడం జరిగింది. 2017లో ధర్మల్ కేంద్రాన్ని ముప్పవరపు వెంకయ్య నాయుడు, నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేయడం జరిగింది. అయితే ఈ జెన్కో థర్మల్ కేంద్రంలో 1810 మంది పర్మినెంట్ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్టు, ఉద్యోగులు కావచ్చు అందరూ కూడా కొనసాగుతున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం బొగ్గుని సప్లై చేయడం ఉత్పత్తి రాలేదని చెప్పడం పక్కనే ఉన్నటువంటి ప్రైవేటు పవర్ ప్లాంట్లో ఉత్పత్తి బాగా వస్తుంది, అని చెప్పి కప్పిపుచ్చడం నాణ్యమైన బొగ్గును అందించకపోవడం అదేవిధంగా బొగ్గు నిల్వలను పెంచకపోవడం వీటన్నిటినీ మభ్య పెట్టి ప్రైవేటు వ్యక్తులకు లీజు పేరుతో ఈ యొక్క ధర్మల్ కేంద్రాన్ని ప్రైవేటుపరం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం దయచేసి ఈ యొక్క ధర్మల్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన విస్మరించాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఎవరైతే ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకి జనసేన పార్టీ అండగా ఉంటుందని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకొని ప్రభుత్వరంగ సంస్థగా ఈ ధర్మల్ కేంద్రాన్ని నడిపించాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మా మద్దతు ఉంది కానీ అది కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి మాకు సంబంధం లేదని చేతులు దులుపుకునారు. ఇప్పుడు ధర్మల్ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది మరి ఎందుకని ప్రైవేటీకరణ కి మీరు మొగ్గుచూపుతున్నారు మీ కేసులు ఏమైనా బయటకు వస్తాయని అని జనసేన పార్టీ తరఫున అడుగుతూనమ్ దయచేసి ఇకనైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనను మానుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ అలా జరగని పక్షంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రహీం, శేషారెడ్డి, పొలంరెడ్డి ఇందిరా రెడ్డి, మల్లికార్జున్, కుమార్, సందీప్, బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.