బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో కనీస అవగాహన ఉందా: గాదె

  • బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో వైసిపి నాయకులకు ఐనా కనీస అవగాహన ఉందా

గుంటూరు: గుంటూరు లాడ్జి సెంటర్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు స్టేట్ కార్యదర్శినయుబ్ కమల్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికారత బస్సు యాత్ర ప్రభుత్వ కార్యక్రమాలు లేక ప్రవేట్ కార్యక్రమాన్ని ప్రశ్నించారు. ఒకవేళ ప్రభుత్వ కార్యక్రమం అయితే ఏ అధికారంలేని ముస్తఫా గారి అమ్మాయి చేత ప్రోగ్రాం ఎందుకు నిర్వహించారు. ఒకవేళ ప్రైవేట్ కార్యక్రమం అయితే పోలీసు వారు ఎలా అనుమతిచ్చారు అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలుగా ఉన్న మేము ఒక చిన్న నిరసన కార్యక్రమం చేపడతామంటేనే హౌస్ అరెస్టులు లేదా అక్కడ నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న విధానం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజున వైసిపి వారు గుంటూరులో ఉన్న ప్రధాన రహదారి మూసివేసి ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేసిన వారికి పోలీసు వారు ఎలా అనుమతించారో పోలీసు ఉన్నతాధికారుల సమాధానం చెప్పవలసి ఉన్నదని అన్నారు. అదేవిధంగా ఈ సభలో మాట్లాడిన గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ముస్తఫా గారికి బస్సు మీద ఉన్న నాయకుల పేర్లు కూడా తెలీకపోవడం గమనార్హం, అసలు వైసిపి నాయకులు ఈ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో వారికి తెలియదని ఇక్కడికి వచ్చిన మంత్రులు కనీస అవగాహన లేకుండా మాట్లాడారని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు మెరుగ నాగార్జున గారు మాట్లాడుతూ తమ ఓట్లు అడగడానికి రాలేదని, కేవలం వారు చేసిన మంచి పనులు చెప్పడానికి మాత్రమే వచ్చావని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల 35 వేల కోట్ల రూపాయల సంక్షేమం చేశారని అని చెప్పి, చివర్లో నూరి ఫాతిమా గారిని ఆశీర్వదించాలని కోరటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అలాగే రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ పరిస్థితి ఎలా ఉందో పట్టించుకోని మంత్రివి నువ్వు అని, కోర్టు ఆదేశాలు వచ్చిన గాని వాటిని పరిచయం పెట్టిన ప్రభుత్వం మీదని ఎద్దేవ చేశారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన విషయం గురించి మాట్లాడటం మంత్రిగారు మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఓట్లు గురించి మాట్లాడాను అని చెప్పి చివర్లో మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. అలాగే మోపిదేవి వెంకటరమణ గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని కులాలు బాగుపడిపోయాయని చెప్పటం విడ్డూరంగా ఉందని చెప్పారు. గతంలో మంత్రిగా పనిచేసిన మోపిదేవి వెంకటరమణ గారు ఇప్పటి రాజ్యసభ సభ్యులు కనీసం వారి కులంలో ఒకరికైనా సరే ఏమిరో ఉపయోగపడ్డారు ప్రజలకు తెలియజేయాలని, వారి నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న వారి కైనా సరే ఏం న్యాయం జరిగిందో తెలియజేయాలి అని చెప్పి ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంకు చెందిన మంత్రులు, ముఖ్యమంత్రి కాపు కార్పొరేషన్ కి నిధులు అడిగిన 2,35,000 కోట్లు చూపిస్తారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కి అడిగిన అదే డబ్బు చూపిస్తారు. బీసీ కార్పొరేషన్ అడిగిన అదే డబ్బు చూపిస్తారు. కానీ అప్పు మాత్రం 11 లక్షలు కోట్లు ఎలా అయిందని చెప్పి సూటిగా ప్రశ్నించారు. ఈ విధంగా వైసీపీ మంత్రులు బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో కూడా తెలియకుండా, మరోసారి ప్రజలను మభ్య పెట్టడానికి బయల్దేరారని అన్నారు. ప్రజలందరూ కూడా వైసిపి ప్రభుత్వం చేస్తున్న మోసాలను గమనించాలని, రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాలకు అధికారి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నయుబ్ కమల్, జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, పట్టణ నాయకులు మధులాల్, శ్రీపతి భూషయ్య, నెల్లూరు రాజేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.