జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహారనిధి కార్యక్రమం

మాడుగుల: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని అనుసరించి మహోన్నత మహిళామణీ ఆంధ్రుల అన్నపూర్ణమ్మ దివంగత డొక్కా సీతమ్మ ఆహార నిధి కార్యక్రమంలో భాగంగా అన్నదానం చేయడం మహాభాగ్యంగా భావిస్తున్నానని జనసేన పార్టీ మాడుగుల నియోజకవర్గ నాయకులు రాయపరెడ్డి కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో కె.కోటపాడు మండల జనసేన నాయకులు కుంచా అంజిబాబు మాట్లాడుతూ.. ప్రతి నెలలో మొదటి గురువారం కె. కోటపాడు మండలంలో ఉన్నటువంటి ఎం.ఆర్.ఓ ఆఫీస్ దగ్గర సాయిరాం మందిరంలో జనసేన పార్టీ తరఫున అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు కుంచాఅంజిబాబు, చుక్కా నారాయణమూర్తి, మండల జనసైనికులు ఇస్మార్ట్ శంకర్, హరీష్, జగదీష్, సత్యనారాయణ, ఆనంద, రామకృష్ణ మండల జనసైనికులు పాల్గొన్నారు.