డాక్టర్‌ బి.ఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించిన దోమకొండ అశోక్

ఆత్మకూరు: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మరియు అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహా బూబ్ మస్తాన్ ఆధ్వర్యంలో అనంత సాగరం బద్వేలు రోడ్డు కూడలి నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. అంటరానితనం కుల వ్యవస్థ రాజ్యమేలుతున్న రోజుల్లో తాను ఎదుర్కొన్న వివక్షను రానున్న తరాలు ఎదుర్కోకూడదని ఒక ఆశయంతో పరిస్థితులకు ఎదురీది ఉన్నత శిఖరాలను అధిరోహించి భారతావనికి రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహాపురుషుని స్మరిస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ అందరికీ అభివృద్ధి ఫలాలు అన్ని కులాలకు అందే విధంగా అందాలి అనే నినాదాన్ని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు నిజం చేస్తారని ఒకసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఎన్నో తరాలుగా మహనీయులు కులవివక్షను రూపు మార్చడానికి ఎంతో కృషి చేసిన ఇప్పటికీ మన మధ్యలో కులచిచ్చు రగిలిస్తూనే ఉన్నారు. ఆర్థిక అసమానతలతో ప్రజలు తల్లడిల్లుతూనే ఉన్నారు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని కులాలకే పరిమితమైన రాజ్యాధికారాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇస్తే అన్ని వర్గాల వారికి అందే విధంగా చేస్తారని, జనసేన పార్టీ తరఫున ఒకసారి మద్దతు ఇవ్వాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్, మండల కార్యదర్శి ఎం పెంచలయ్య, ప్రసాద్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.

విజయవాడ: భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా…7వ డివిజన్ ప్రధాన కార్యదర్శి బండి ప్రదీప్ అధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి 7వ డివిజన్ నాయకులు దోమకొండ అశోక్ ముఖ్య అతిథిగా వీచ్చేసి అంబేడ్కర్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దోమకొండ అశోక్ మాట్లాడుతూ.. ఆధిపత్య ధోరణులకు, వివక్షకు తావివ్వకుండా సమస్త మానవులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో, పరస్పర గౌరవంతో పరోపకారం పరిఢవిల్లేలా కలిసిమెలసి జీవించాలనే, వసుధైక కుటుంబ ధృక్పథాన్ని తన రాజ్యాంగం ద్వారా పౌర సమాజానికి అందించిన మహనీయుడు డా. బి.ఆర్. అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన జాతికి చేసిన సేవలను స్మరించుకుంటున్నాను. తాను అనుభవించిన సామాజిక వివక్షను సవాల్ గా తీసుకుని విజయం సాధించి విశ్వమానవ సౌభ్రాతృత్వానికి దిక్సూచిగా నిలిచి, ప్రపంచ మేధావిగా ఎదిగిన అంబేద్కర్ గారి జీవితం సదా ఆచరణీయమైనది. జీవిత పర్యంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్, భారతదేశ అస్తిత్వపు ప్రతీక.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, విలువలను అనుసరిస్తూ, దళిత, బహుజన, పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ, వివక్ష లేని సమాజాన్ని నిర్మిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఐక్యమత్యంగా ముందుకు సాగడమే ఆ మహానుభావునికి మనమిచ్చే అసలైన నివాళి అని భావిస్తున్నాను అని దోమకొండ అశోక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, విజయ్, సాయి బ్రహ్మాజీ, జనసేన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.