అభివృద్ధి గురించి వైసిపి చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దు: గునుకులు కిషోర్

నెల్లూరు రూరల్ శ్రామిక నగర్ లో స్థానిక ప్రజలు మౌలిక వసతుల లేమి తో ఇబ్బంది పడుతున్నారు అంటూ కమీషనర్ కి జనసేన పార్టీ తరఫున ఫిర్యాదు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకులు కిషోర్ మాట్లాడుతూ
▪️ అభివృద్ధి గురించి వైసిపి వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దు అభివృద్ధి మొత్తం వైసీపీ చేస్తుంది అని మొన్ననే ఆ పార్టీకి చెందిన పెద్దాయన శంకుస్థాపన చేస్తూ ప్రెస్మీట్లో చెప్పారు.
▪️ ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి శంకుస్థాపనలు ముమ్మరం చేశారు. నెల్లూరు రూరల్ గతంలో ఆ పెద్దాయన పోటీ చేస్తానన్న నియోజకవర్గం ఇప్పుడు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న నియోజకవర్గం కార్పొరేషన్ లిమిట్ లోని 30వ డివిజన్లో శ్రామిక నగర్ నందు గుక్కెడ మంచినీళ్లు కోసం ప్రజలు అల్లాడుతున్నారు.
▪️ శ్రామిక నగర్ ఏర్పడి 20 సంవత్సరాలు మరియు వైయస్సార్ నగర్ ఏర్పడి 15 సంవత్సరాలు గడుస్తున్నా కనీస మౌలిక వసతులు కనిపించలేక ఈ ప్రభుత్వం విఫలమైంది.
▪️ పై పెచ్చు ఈ పది సంవత్సరాలు కూడా స్థానికంగా గెలిచింది ఆ పార్టీనే,
వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగే సంవత్సరం పైబడినా, అండర్ వాటర్ పైప్ లైన్ పనులు పూర్తయి కూడా పూర్తయి దాదాపు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఇంటికి సరిగా వాటర్ సప్లై లేదు.
▪️ వాటర్ ట్యాంకర్లతో సప్లై చేస్తున్న నీరు సప్లై కనీసం వారం రోజులు కి వచ్చే పరిస్థితి కూడా లేదు. మలయ్య గుంట అనే ప్రాంతంలో దాదాపుగా వాటర్ ట్యాంకర్ ని గాని, నీటిని గాని చూసి రెండు సంవత్సరాలు పైన అవుతుందని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
▪️ సైడ్ కాలవలు లేక వ్యర్దాలు అంతా ఆరుబయటే పడి దుర్గంధం వెద జల్లుతూ పందులు పాములు దోమలుతో ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
▪️ ఆ రెండు ప్రాంతాల్లో దాదాపు 10000 కుటుంబాలు అంటే 30 వేల ప్రజలు, ప్రజలంటే వారికి అర్థం కాకపోవచ్చు దాదాపుగా 30000 మంది ఓటర్లు నివసించే ప్రాంతం వారికి కనీసం మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.
▪️ గత రెండు సంవత్సరాల నుంచి కార్పొరేషన్ కి అర్జి ఇస్తున్నాం. సంబంధిత అధికారులకు కమిషనర్ దీన్ని ఎండార్స్ చేశారు.
▪️ 30 రోజుల్లో ఈ సమస్య పరిష్కరించకపోతే జనసేన పార్టీ తరఫున నిరసన ఉధృతం చేసి స్థానికుల మౌలిక వసతులు కల్పించే దాకా కూడా స్థానికులకు అండగా నిలబడతాము.
▪️ మరొకసారి గుర్తు చేస్తున్నాం అభివృద్ధి జరగాలన్నా ప్రజలు బాగుండాలన్న హలో ఏపి బై బై వైసిపి అనే నినాదాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాము అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు జిల్లా కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, ఖలీల్, బాలాజీ, షాజహాన్, మౌనిష్, వర్షన్, శీను తదితరులు పాల్గొన్నారు.