డోంట్ మిస్: నేడే అరుదైన పూర్ణ చందమామ…!

దేశంలో చలిగాలుల తీవ్రత విపరీతంగా ఉంది.చల్లటి వాతావరణంలో, బయట నుంచుని ఆ చల్లటి గాలుల్ని ఆస్వాదిస్తూ, ఆకాశంలో ప్రసరించే నిండు చందమామని చూస్తుంటే వచ్చే థ్రిల్ వేరు కదా. అయితే, అలాంటి థ్రిల్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మరి. ఈరోజు మనము చంద్రుడిని సంపూర్ణంగా చూడవచ్చు అన్నమాట.దీన్నే డిసెంబర్ ఫుల్ మూన్ (full moon of December) అని అంటున్నారు.అంటే డిసెంబర్ నెలలో రాబోతున్న సంపూర్ణ చందమామ కాబట్టి దీనిని డిసెంబర్ ఫుల్ మూన్ అంటున్నారు. ప్రతీ నెలలో సంపూర్ణ చందమామ వస్తూనే ఉంటుంది కదా… దీనిలో ప్రత్యేకత ఏముంది అని అనుకుంటున్నారా.? కానీ, ప్రతినెల వచ్చే సంపూర్ణ చంద్రుడు కంటే ఈసారి వచ్చే ఫుల్ మూన్‌కి నాలుగు ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

ఈ 2020 సంవత్సరంలో ఆఖరి ఫుల్ మూన్ ఇదే కావడం. అలాగే ఇప్పుడే వచ్చే ఫుల్ మూన్ అత్యంత చల్లటి గాలులు వస్తున్న సమయంలో వస్తోంది కాబట్టి.అంతేకాదండోయ్ ఈ మూన్ మంచు వాతావరణంలో సరికొత్తగా మనకి కనిపిస్తుంది. ఇకపోతే మూడవ ప్రత్యేకత ఏంటంటే డిసెంబర్ 21 నుంచి పగటి సమయం కంటే రాత్రి సమయం పెరుగుతోంది.అంటే ఈ ఫుల్ మూన్.రాత్రి సమయం ఎక్కువగా ఉన్న రోజుల్లో రాబోతోంది.అలాగే ఈ చందమామను అమెరికాలో లాంగ్ నైట్స్ మూన్ (‘Long Nights Moon’) పిలుస్తున్నారు.

క్రిస్మస్ తర్వాత వచ్చే సంపూర్ణ చందమామను అలా అక్కడ పిలుస్తారు. యూరప్‌లో యూలే తర్వాత వచ్చే చందమామ (‘Moon after Yule’) అంటారు.

డిసెంబర్ 21న గురుగ్రహం పక్కనే శనిగ్రహం కనిపించింది. దాన్ని క్రిస్మస్ స్టార్ (‘Christmas Star’) అని పిలిచారు. అందరూ కళ్లారా ఆ దృశ్యం చూసిన సంగతి తెలిసిందే. కాకపోతే అసలు 2020 కోల్డ్ మూన్ ను ఎప్పుడు, ఎలా చూడాలో తెలుసుకుందాం.

ఈ కోల్డ్ మూన్ ఈ సంవత్సరంలో వచ్చిన 13వ సంపూర్ణ చందమామ. ఇది వరుసగా రెండు రోజులు కనిపిస్తుంది.మొదటిది డిసెంబర్ 29న అంటే మంగళవారం రాత్రి కనిపిస్తుంది. ఇది రాత్రంతా కనిపిస్తుంది.

అలాగే మంగళవారం కంటే, బుధవారం ఇంకా సంపూర్ణంగా, స్పష్టంగా ఉన్న చందమామ మనకి కనిపిస్తుంది.భారతీయులు అంతా ఈ దృశ్యాన్ని కళ్లారా చూడవచ్చు.డిసెంబర్ 29న రాత్రి 10.30కి సంపూర్ణ చందమామ అమెరికాలో మొదలవుతుంది.అంటే మన మన దేశంలో డిసెంబర్ 30 ఉదయం 8.58కి మొదలవుతుంది.ఐతే… 29 రాత్రి, 30 రాత్రి వేళ చందమామ సంపూర్ణంగానే కనిపిస్తుంది.ఈ రెండ్రోజులూ టెలీస్కోప్ పెట్టి చూస్తే చందమామ ఎంతో కాంతివంతంగా, ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.

ఎందుకంటే గాలిలో ఉండే మంచు ఒక కారణం అయితే, కంటికి కనిపించని అతి చిన్న మంచు కణాలు అన్ని కలిసి గాలిలో ఎగురుతూ చందమామను మెరిసేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.అయితే ఈ చందమామ సాయంత్రం 6 తర్వాత తూర్పు వైపు దర్శనమిస్తుంది, అలాగే సాయంత్రం 7 అయ్యేసరికి చందమామ మన తలపైకి వచ్చేస్తుంది. మర్చిపోకండి ఆ సమయంలో చంద్రుడిని మనం కచ్చితంగా చూసి తరించాలిసిందే.