పొదలాడ గ్రామంలో ఎన్.డి.ఏ కూటమి ఇంటింటి ప్రచారం

రాజోలు మండలం, పొదలాడ గ్రామం తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో భాగంగా సుమారు 100 మంది కార్యకర్తలతో ప్రతిరోజు ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ఉమ్మడి మేనిఫెస్టో గురించి సూపర్ సిక్స్ గురించి మహిళలకు, ఓటర్లు అందరికి కూడా సవివరంగా వివరించి ఉమ్మడి అభ్యర్థులైన రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి శ్రీ దేవ వరప్రసాద్ గారికి గాజు గ్లాస్ గుర్తుపై అలాగే అమలాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ గంటి హరీష్ బాలయోగి గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఇరువురిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించడం జరుగుతుంది. ప్రజలు సూపర్ సిక్స్, బిసి డిక్లరేషన్ అలాగే మేనిఫెస్టో మీద ప్రత్యేకమైన ఆకర్షితులు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కడలి సత్యనారాయణ, ఎంపీటీసీ శ్రీ శిరిగినీడి వెంకటేశ్వర గారు, మాజీ ఎంసీ చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ మూర్తి, కాండ్రేగుల కుసుళుడు, టిడిపి గ్రామ శాఖ అధ్యక్షులు పోతురాజు రాధాకృష్ణ, జనసేన గ్రామ శాఖ అధ్యక్షులు పంచదార చిన్న బాబు, సిరిగినీడి బాబ్జి, మానుకొండ ప్రసాద్, లంకె వెంకటనారాయణ మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.