మృతురాలు కుటుంబానికి డాక్టర్ కందుల ఆర్దిక సహాయం

వైజాగ్ సౌత్: దక్షిణ నియోజకవర్గంలో ఓ మృతురాలు కుటుంబానికి దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అండగా నిలిచారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి చేయూతనందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ కేవలం మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి ఈ సహాయాన్ని చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అల్లిపురం చలువ తోట ప్రాంతానికి చెందిన మృతి చెందిన పుష్ప రాణి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి తన సంతాపాన్ని తెలిపారు. తన వార్డులోనే కాకుండా దక్షిణ నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా వారికి అండగా నిలిచేందుకు తాను ముందు ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, తెలుగు అర్జున, మృతురాలు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.