నో మై కాన్స్టిట్యుఎన్సి 34వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన నో మై కాన్స్టిట్యుఎన్సి కార్యక్రమంలో భాగంగా ఆదివారం తొట్టంబేడు మండలం, పిల్లమెడు పంచాయతీలోని దయనేడు హరిజనవాడ, దయనేడు, రాళ్లపల్లి గ్రామాల్లో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా గ్రామాకి వెళ్ళే రోడ్ దారుణమైన పరిస్థితిలో గుంతలమయం అయ్యి ఉంది, గ్రామానికి బస్ సౌకర్యం లేదు బస్ కొరకు 3 కి.మీ నడవాల్సిన పరిస్థితి, డ్రైనేజీ కాలువలు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, త్రాగడానికి మంచి నీళ్ళు లేవు. సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కొరకు పార్టీ తరఫున పోరాడుతామని వినుత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల గోపి, నాయకులు రవికుమార్ రెడ్డి, నితీష్, ముడుసు గణేష్, శివ, శీను, తులసి రామ్, జనసైనికులు పాల్గొన్నారు.