అగ్నిప్రమాద బాధితులకు అండగా డా. రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, అంతర్వేది పల్లిపాలెం గ్రామం లో నివాసం ఉంటున్న బొమ్మిడి నాగరాజు ఇల్లు మంగళవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా కాలిపోయింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బుధవారం వారికి అండగా ఉండటం కోసం వారిని కలసి, నిత్యావసర వస్తువులను అందచేసి, త్వరలో జనసేన పార్టీ తరుపున వారిని ఆదుకుని సహాయం చేస్తామని, వారికి భరోసా కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లు వెంకటరాజు, రాపాక మహేష్, దుర్గాప్రసాద్, మణికంఠ, స్వామి తదితరులు ఉన్నారు.