జగనన్న కాలనీలను సందర్శించిన డా. యుగంధర్

  • సొంత గ్రామాన్ని నిర్లక్ష్యం చేసిన ఉపముఖ్యమంత్రి
  • వ్యర్థ జలానికి నిలయమైన జగనన్న కాలనీ
  • జగనన్న కాలనీ ఎలావుందీ అనడానికిదే నిదర్శనం
  • ముమ్మాటికీ నారాయణస్వామి అసమర్థుడే
  • జనసేన ఇంచార్జి యుగంధర్

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: కర్వేటి నగరం మండలంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాదిరికుప్పం గ్రామానికి కేటాయించిన జగనన్న కాలనీని నియోజకవర్గ ఇన్చార్జ్ యుగంధర్ జనసేన పార్టీ నాయకులతో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సొంత గ్రామమైన పాదిరికుప్పానికి ఒక యాక్సిడెంట్ జోన్లో జగనన్న కాలనీ కేటాయించి, గుట్టను చదును చేసి, లక్షలు వెచ్చించి, చివరికి ఆ ప్రాంతం ఆవాసయోగ్యానికి నోచుకోకపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పక్కనే ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీ కి సంబంధించిన వ్యర్ధ జలాలకు జగనన్న కాలనీ ఆవాసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని లూటి చేసిన ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారాయణస్వామి పదవికి అనర్హుడని, సోషల్ ఆడిట్ చేసి దుర్వినియోగమైన ధనాన్ని తిరిగి ధనాగారానికి చేర్చాలని, ఆయన ఎమ్మెల్యేగా కొనసాగటానికి వీలులేదని ఈ సందర్భంగా తెలియజేశారు. రాత్రికి రాత్రే ఉన్నపలంగా 75 సంవత్సరాల పైబడిన ఒక రైతు మామిడి తోటను, 9 ఎకరాలు తన సొంత గ్రామంలో ఉన్న ప్రజలకు కేటాయిస్తానని చెప్పి నరికేసి, చివరికి గ్రామ ప్రజలకు అన్యాయం చేశారని ఎద్దేవా చేసారు. ఇప్పటికైనా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి వందసార్లు అయినా ముఖ్యమంత్రి కాళ్ల మీద పడి అక్రమంగా చెట్లను నరికేసిన భూమికి నష్టపరిహారం తీసి ఇచ్చి, పాదిరి కుప్పం గ్రామ ప్రజలకు పట్టాలు ఇచ్చి, వారి రుణం తీర్చుకోవాలని హితవు పలికారు. అలా చేయకపోతే ఒక రైతు 75 సంవత్సరాల తోటను నరికేసిన పాపం, గ్రామ ప్రజలకు జగనన్న కాలనీలో చోటు లేకుండా చేసిన పాపం రెండూ చుట్టుకుని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో సావధానంగా నియోజకవర్గ ప్రజలు నిన్ను ఇంటికి పంపడం ఖాయమని తెలిపారు. దీనినిబట్టే తెలుస్తుంది జగనన్న కాలనీ ఎలా ఉందో నియోజకవర్గంలో అని చెప్పడానికి అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ముమ్మాటికి అసమర్థుడైన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అని, ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి కాదు, నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలకు ఉపయోగపడేవాడు కాదు, తన సొంత కుటుంబానికి మాత్రమే ఉపయోగపడే వ్యక్తి అని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో కార్వేటి నగర్ మండల అధ్యక్షులు శోభన్ బాబు, టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, వెదురుకుప్పం మండల బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శి నరేష్, ఎస్ఆర్ పురం మండల ఉపాధ్యక్షులు చార్లెస్, కార్వేటి నగరఒ మండల బూత్ కన్వీనర్ అన్నామలై, టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు మనీ, పాల సముద్రం మండల ప్రధాన కార్యదర్శి రాఘవ, పాలసముద్రం మండల కార్యదర్శి అరుణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.