లింకు దస్తావేజు ఉన్నవారికి వెసులుబాటు కల్పించాలి: రామ శ్రీనివాస్

రాజంపేట: అన్నమయ్య జిల్లాలోని రాజంపేట రెవిన్యూ డివిజన్ పరిధిలో సుండుపల్లి వీరబల్లి రాజంపేట పుల్లంపేట చిట్వేల్ మండలాల్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు మే నెల 15వ తేదీ నుంచి నిలిపివేసినారని జాయింట్ కలెక్టర్ పర్మాన్ అహ్మద్ ఖాన్ కు శనివారం ఉదయం జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన జేసీతో మాట్లాడుతూ.. గ్రామాలలోని రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన తెలిపారు. భూములు, ల్యాండ్ కన్వర్షన్ లేని స్థలాలు, ప్లాట్లు, వెంచర్లు క్రయవిక్రయాలు నిలుపుదల చేసినందువల్ల కొత్త వెంచర్లకు వేసుకున్న వాటిని కాకుండా పది సంవత్సరాలు ముందుగా స్థలాలు ప్లాట్లు నెంబర్లతో రిజిస్టర్లు లింక్ డాక్యుమెంట్లు బ్యాంకు లోన్లు తీసుకుని స్థలాలకు రిజిస్టర్ చేయకపోవడం చాలా దారుణమైన విషయం అన్నారు. చిట్వేల్ సుండుపల్లి మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రోడ్లు లేక, డ్రైనేజీ వ్యవస్థ ఎక్కువగా ఉన్నదని త్రాగునీటి సమస్య అధికంగా ఉన్నదని వెంటనే పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ జాయింట్ కలెక్టర్ కు శనివారం ఫిర్యాదు చేశారు. వెంటనే పరిష్కరిస్తానని జేసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సోషల్ జస్టిస్ మెంబర్ షైక్ సలీమ్, జిల్లా కార్యక్రమాల సభ్యులు, నాయకులు, జనసైనికులు, భాదితులు పాల్గొన్నారు.