మోపిదేవి జనసేన ఆధ్వర్యంలో జగనన్న కాలనీల సందర్శన

  • #failureofjaganannacolonies

అవనిగడ్డ నియోజకవర్గం: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్వర్యంలో పార్టీ మండల ఉపాధ్యక్షులు భోగిరెడ్డి సాంబశివరావు అధ్యక్షతన మండల పరిధిలోని ఉన్న రావివారిపాలెం, పెదప్రోలు గ్రామాల్లో ఉన్న జగనన్న కాలనీలను శనివారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారౌ మాట్లాడుతూ.. జగనన్న కాలనీలు రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఇళ్ల స్థలాలు మురుగు నీటితో చెరువులుగా మారిన పరిస్థితి ఏర్పడింది. అలాగే జగనన్న లేఔట్లలో రోడ్ల సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాట్లు లేక రోడ్లపై నిలిచిన నీటిలో నడవలేక, పేదల కన్నీళ్లు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కేటాయించిన నిధులకు ఇంటి నిర్మాణం పూర్తికాక అప్పులు చేసి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఆ ఇంట్లో నివసించేందుకు కూడా వీలు లేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు అక్రమాలు, ఇసుక దోపిడిలు ఆపాలని మరియు జగనన్న లేఔట్ లో మౌలిక వసతులు కల్పించి పెద ప్రజలకు అండగా నిలవాలని ప్రభుత్వ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి మండల పార్టీ ఉపాధ్యక్షులు మెరకనపల్లి నరేష్, మండల కమిటీ నాయకులు ఆకుల పవన్ కళ్యాణ్, కలపాల ప్రసాద్, గరికపాటి కృష్ణ ప్రసాద్, కేతరాజు రామకృష్ణ, గ్రామ పార్టీ అధ్యక్షులు పర్చూరి కేశవ, యర్రంశెట్టి సునీల్, కాగితాల సాంబశివరావు, మత్తి వంశీ కృష్ణ, మండల స్థాయి నాయకులు బాదర్ల లోలాక్ష నాయుడు, అర్జా కాంత్, అర్జా రాధిక, కోసూరు అన్వేష్ బాబు, రాఘవ కూరేటి మరియు జనసైనికులు పాల్గొన్నారు.