జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొన్న డాక్టర్ కందుల

వైజాగ్ సౌత్: దక్షిణ నియోజకవర్గంలో అల్లిపురం ఏడుగుళ్ళు ప్రాంతంలో మంగళవారం జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహించారు. ఆషాడ శుద్ధి తదియ సందర్భంగా ఉత్కల్ యువ సేవా సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన జగన్నాథ, సుభద్ర, బలబద్ర, రథయాత్రలో దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు 32వ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు సాంప్రదాయ దుస్తులలో పాల్గొని ప్రారంభించారు. పూరిలో జరిగే సాంప్రదాయలను పాటిస్తూ పూజలు చేశారు. అనంతరం రథం సిద్ధం చేసి అందులో జగన్నాథుడు, బలబద్రుడు, సుభద్రదేవిల విగ్రహాలను పెట్టారు. ఈ సందర్భంగా కోలాటం, డబ్బులు, భజనలతో, జై జగన్నాథ అంటూ నినాదాలు చేస్తూ రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు రమేష్ పాడి, ప్రవీణ్, సుదర్శన్, ద్రోణంరాజు శ్రీవత్స, డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు జనసైనికులు, వీరమహిళలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.