దక్షిణంలో కొనసాగుతున్న డాక్టర్ కందుల సేవలు

దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు సేవలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పర్యటిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి తన సాయాన్ని అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం
నియోజకవర్గంలో 37వ వార్డు రెల్లి వీధి అంబెడ్కర్ బొమ్మ వద్ద నవ వధువు ప్రమీలకు తాళిబొట్టు, పట్టు చీరను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా వారికి సహాయం చేసేందుకు తను ఎప్పుడు ముందు ఉంటానని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా తను చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని చెప్పారు. తన జీవితం ప్రజాసేవకే అంకితం అని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు గరికిన రవి, కేసం చిన్నారావు, గరికిన హరికృష్ణ, గరికిన సూరిబాబు, బడే సత్తారావు, రాయతీ తాతరావు, వడ్డాది ఆనంద్, మహేందర్, గరికిన రాజు, సూర్యనారాయణ, నాగేంద్ర, శివ, అప్పారావు, వెంకటేష్, బద్రీనాథ్, కేదార్నాధ్ తదితరులు పాల్గొన్నారు.