పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 46వ రోజు

  • కుమ్మెర గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ 46వ రోజు పాదయాత్ర

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, కుమ్మెర గ్రామంలో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా మూడవ విడత పాదయాత్రలో భాగంగా వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ మండలం, కుమ్మెర గ్రామంలో, వంగ లక్ష్మణ్ గౌడ్ నియోజకవర్గ నాయకులతో కలిసి గ్రామంలో పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ఒక వర్గ పాలనలో నలిగిపోతున్న నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒక వర్గ పాలనకు స్వస్తి పలకాలని చెప్పి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్ళినా అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఆగడాలకు, నమ్మిచ్చి ఓటేసిన పాపానికి ప్రజలు బలవుతున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించటానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 9 సంవత్సరాల నుంచి ఎక్కడలేని విధంగా అభివృద్ధి చేసినం అని మాయ మాటలు చెప్తూ, ఇప్పటికీ కూడా ఇంకా అధికార పార్టీ మాయ మాటలతో వారి పబ్బం గడుపుతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని మర్చిపోకండి. బీరు, బిర్యానికి ఆశపడి కోటర్ కి ఆశపడే రోజులు అయిపోయినయి.. గుర్తుపెట్టుకోండి.. వచ్చేది కొత్త తరం పాలన.. పాలన మారితే తప్ప మా బిడ్డల భవిష్యత్తు మారదని ప్రజలు భావిస్తున్నారు. కుమ్మెర గ్రామ భు నిర్వాసితులకు అండగా ఉంటాం. కుమ్మెర గ్రామానికి పాలమూరు రంగారెడ్డి వట్టెం రిజర్వాయర్ పేరుతో, భూములు కోల్పోయిన రైతులకు తక్కువ పారితోషికం ఇచ్చి, పబ్బం గడిపిన అదికార పార్టీ నాయకుల వైనం… నిర్వాసితులకు అండగా జనసేన పార్టీ తోడుగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. కచ్చితంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలు బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు ముందుకు వేయటం ఖాయం .! వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నానుని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు
గోపాస్ కుర్మన్న, మహేష్ గౌడ్, ఆరిఫ్, విజయ్ భాస్కర్ గౌడ్, సూర్య, నరసింహ, భాస్కర్, పూస శివ, సందీప్, శివ కుమార్, నాగరాజు, సంజెయ్, సాంబ శివుడు, మహేష్, సొంటి శ్రీశైలం, శివ, సతీష్,తదితరులు పాల్గొన్నారు.