జగన్ రెడ్డికి సరైన ప్రత్యర్ధి పవన్ కళ్యాణ్: శాంతి ప్రసాద్ సింగలూరి

  • “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” ఆధ్వర్యంలో 11వ జూమ్ సమావేశం
  • పలు దేశాల నుండి జూమ్ సమావేశంలో పాల్గొన్న ఎన్నారై జనసేన నాయకులు మరియు వీరమహిళలు.

“జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” ఆధ్వర్యంలో ఆ టీమ్ ఫౌండర్ సురేష్ వరికూటి అధ్యక్షతన అడ్వకేట్ మరియు జనసేన నాయకులు శాంతి ప్రసాద్ సింగలూరి ముఖ్య అతిథిగా ఆదివారం జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. సురేష్ వరికూటి టీంని పరిచయం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25 దేశాల నుండి ఎన్నారై జనసైనికులు మరియు వీరమహిళలు అందరూ సంఘటితమై ఒక్క టీమ్ గా అందరూ కూడా కనెక్ట్ అవుతూ… మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనసేన లీడర్స్ తో కనెక్ట్ అవుతూ, లోకల్ గా పనిచేస్తున్న కార్యకర్తల నుంచి ఇన్పుట్ మరియు, ఎన్నారైలు ఇచ్చిన సలహాలు తెలుసుకొంటూ అవి పార్టీకి ఉపయోగపడేలా అనువర్తిస్తూ, ఇంకా మనం పార్టీని ఎంత బాగా ముందుకు తీసుకు వెళ్ళొచ్చనే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వడ్రాణం నాగరాజు, శాంతిప్రసాద్ ని టీంకి పరిచయం చేస్తూ, 37 సవంత్సరాలుగా అడ్వకేట్ గా పని చేస్తూ పార్టీకి వారు చేస్తున్న జనసేన లీగల్ సెల్ సేవల గురించి, సోషల్ మీడియాలో, టీవీ డిబేట్స్ లో ఏ విధంగా స్పందిస్తారనే దానిని గురించి వివరించడం జరిగింది. శాంతి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజారాజ్యంలో కృష్ణాజిల్లా లీగల్ సెల్ లో పనిచేయడం జరిగిందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, 2018 లో ఉగాది రోజున ఒక మీటింగ్ పెట్టి ప్రజారాజ్యంలో పని చేసిన ముఖ్య కార్యకర్తలని పిలవటం జరిగింది అప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ తో 1 టూ 1 మీటింగ్స్ లో ఎన్నో భావాలను షేర్ చేసుకున్నప్పుడు. ఇలాంటి ప్రజాహితం వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా నిలపెట్టుకోవాలి అని దృఢమైన భావన కలిగి, అప్పటి నుంచి పార్టీ కోసం కృషి చేసుకొంటూ ముందుకు వెళ్తూ, బ్రతికినంత కాలం ఆయనతోనే కలిసి ఉండాలి అనే నిర్ణయానికి వచ్చాను అని చెప్పారు. 2019లో పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఆయనకి సహకారం అందించడం జరిగిందని, జనసేన పార్టీ లీగల్ సెల్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఎన్నో అసంఘటిత పోస్ట్ లు వస్తున్నాయి. వాటిని లీగల్ గా జనసైనికులు ఎలా ఎదుర్కోవాలని అడిగిన ప్రశ్నకు నా సూచనలు సలహాలు ఏమిటి అంటే, పనికి మాలిన పోస్ట్ లు పెట్టి, వేరే పార్టీ వాళ్ళు మన ట్రాక్ తప్పించి, వేరే విధంగ ఫోకస్ వెళ్లేలా చేస్తున్నారు అనేది గ్రహించాలి, వాళ్ళు మనల్ని రెచ్చకొడతానికి పెడుతున్నారని గ్రహించండి. మనం రెచ్చిపోయి అసాంఘికమైన భాషలో రిప్లై ఇచ్చేలాగా రెచ్చకొడతారు. కావున మొదటిదిగా ఆ పోస్ట్ లను సేవ్ చేసి మీకు కుదిరితే వాటిమీద పోలీస్ కేసు పెట్టండి. వాళ్ళు కేసు రిజిస్టర్ చేసిన చెయ్యక పోయిన మీరు అయితే లీగల్ గానే రిప్లై ఇవ్వండి అని అన్నారు. కావాలి అంటే మీకు భాష మీద పట్టు ఉంటే వ్యంగంగా రిప్లై అయితే ఇవ్వవచ్చు. ఆలా చేయటం వల్ల మన మీద తిరిగి ఏ విధమైన కేసులు పెట్టే అవకాశం లేదని తెలిపారు. మరియు వేరే పార్టీ వారు మన మీద అస్లీల పోస్ట్ లు పెడితే దానికి రిప్లైగా మీరు కూడా రెచ్చి పోయి అలాంటి పోస్ట్ లు పెట్టవద్దు అది జనసేన సిద్ధాంతాలకు వ్యతిరేకం అని అన్నారు. మనం పార్టీకి వర్క్ చేస్తున్నప్పుడు ఒక తప్పుడు కేసు పెడితే ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నకు తప్పుడు కేసు అనేది ఒక అడ్వకేట్ అయిన నా మీద కూడా పెట్టవచ్చు కాబట్టి, వాటిని నేరుగా ఎదురుకోవటమే. ఒక ఉదాహరణ తీసుకొని చెప్పాలి అంటే పాము ఇంట్లో దూరితే పామే కదా అని మనం వదిలేయం కదా అది బయటికి పోయేదాకా మనం జాగ్రత్తగా వ్యవహరిస్తాం కదా అలాగే ఈ కేసులు కూడా అంటే మనం పోరాడి వాటిని తప్పుడు కేసులు అని నిరూపించుకోవచ్చు అని అన్నారు. ఒక ఉదాహరణ సంఘటన తీసుకొని చెప్పాలి అంటే ఏలూరు జిల్లా కొరుకుళ్లు గ్రామం జనసేన సర్పంచ్ మీద కొంతమంది వ్యతిరేక పార్టీ వాళ్ళు కేసు పెడితే, నా కట్టె కాలే అంతవరకు పవన్ కళ్యాణ్ తోనే ఉంటానని ఆమె పోరాడి గెలిచిందని అన్నారు. ఈ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని మండలం వారీగా లీగల్ టీం ని జనసేన పరంగా జనసేన కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని అన్నారు. లోకేష్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ సుగాలి ప్రీతి కేసుని శాంతి ప్రసాద్ డీల్ చేస్తున్నట్లు తెలిపారు. మరియు ఎన్నారైగా మేము మన రాష్ట్రానికి, మన పార్టీకి ఏమి చేయగలము అని అడిగిన ప్రశ్నకు శాంతి ప్రసాద్ మాట్లాడుతూ ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే ఎనుముల వెంకటపతి రాజు అనే వ్యక్తి లండన్ లో ఉంటూ రాజోలు నియోగకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ పరంగా ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక కేసుని వేసి వారు గెలిచారు. అలానే మీరు కూడా మన రాష్ట్రములో ఉన్న ఎదో ఒక ఇష్యూ పరంగా టేక్ అప్ చెయ్యవచ్చు అని అన్నారు. కాకపోతే ఆ ఇష్యూలో నిజానిజాలుని అంచనా చేసుకోవాలి ఆలా ప్రతి అంశంలో సమస్యలు ఉంటాయి. చెయ్యాలి అనుకొంటేమరి అలానే పార్టీ పరంగా సమయం వచ్చినప్పుడు పార్టీనే పిలుస్తుంది. అది కాకుండా పార్టీ పరంగా మీరు డైరెక్ట్ గా చెయ్యాలి అంటే ప్రచార పరంగా ఆక్టివ్గా తిరిగే కార్యకర్తలకు పాంపిలేట్స్, జండాలు పంచవచ్చు, ఇంకో ప్రోపగండా చేయ్యవచ్చు మీ ఏరియాలో ఎవరికి అయితే 18 ఇయర్స్ వచ్చాయో ఆ యువకులతో ఓటు రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్స్ చెయ్యవచ్చు, లేదా వీడియోస్ రూపాన పార్టీ కోసం సేవ చెయ్యవచ్చు. అలా జనసేన సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్ళే విధంగా ప్రయత్నించాలి అని తెలిపారు. వైసిపి వాళ్ళు గాజు గ్లాసు గుర్తు తీసేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దని తెలిపారు. సురేష్ వరికూటి మాట్లాడుతూ “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” తరపున జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ళడానికి 12000 పోస్టర్లను 20 నుండి 25 నియోజకవర్గాలలో క్రియాశీలక కార్యకర్తలకు ఇచ్చి పంపిణీ చేసేవిధంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. ఇంద్రనీల్ ముప్పిడి గ్రౌండ్ లో మన పార్టీ ఎలా ఉంది అనే ప్రశ్నకు సమాధానంగా. ముఖ్యం గ ఒక ట్రెండ్ గుర్తుపెట్టుకోండి ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే స్వీప్ చేస్తుందో ఆ పార్టీ గెలుస్తాది .. మార్పు అనేది ఉభయ గోదావరి జిల్లా నుంచి స్టార్ట్ అవుతాది మన పార్టీ ఆ జిల్లాల నుంచి చుస్తే చాల బగుంది . జగన్ రెడ్డి సెల్ఫ్ గోల్స్ బాగా వేస్తుంటారని దానికి ఉదాహరణగా వారాహి వాహనానికి ప్రచారం వైసిపి వాళ్ళు బాగా మంచి ప్రచారం చేసారని తెలిపారు. జగన్ రెడ్డికి సరైన ప్రత్యర్ధి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఈ సమావేశంలో జర్మనీ నుండి సురేష్ వరికూటి, సుధాకర్ వరికూటి, లోకేష్ పెద్దిరెడ్డి,యూకే నుండి నాగరాజు వడ్రాణం, పద్మజ రామిశెట్టి, వికాస్ దేశాది, యూఏఈ నుండి ఇంద్రనీల్ రాజ్ ముప్పిడి, బెల్జియం నుండి ప్రవీణ్ జరుగుమల్లి, కృష్ణ చైతన్య, ఆస్ట్రేలియా నుండి హేమలత గాదిరెడ్డి, ఫణిరాజ్ సరోజిని, సౌత్ కొరియా నుండి నాగ వంశీ కృష్ణ తిరుమలశెట్టి, సేచిల్లిస్ నుండి రమేష్ సేపేన, సింగపూర్ నుండి ఏపుగంటి సత్యసాయిరాం, న్యూజిలాండ్ నుండి సాయిరాం తోట రాజ్, తోట, మలేషియా నుండి పుల్లారావు, ఐర్లాండ్ నుండి రాజేంద్ర గాదె, ఇండియా నుండి కందుకూరి రాంబాబు, పరుచూరి అవినాష్, చంద్రశేఖర్ మారిశెట్టి, రాజ్ తోట, సూరిబాబు మరియు సత్య తట్టల తదితరులు పాల్గొన్నారు.