అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘన నివాళులర్పించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా పిఠాపురం నందు కోటగుమ్మం సెంటర్లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఆశయాలను నేటి యువత నెరవేర్చాలి. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహా పురుషుడు పొట్టి శ్రీరాములు, తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రంకోసం ప్రాణత్యాగం చేసిన త్యాగధనుడు.. శ్రీ పొట్టి శ్రీరాములుగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని చరిత్రను మనం గుర్తుంచుకోవాలని జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తూంటే ఉంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఏ పథకం పెట్టిన ఏ ప్రాజెక్ట్ కట్టిన వారి తండ్రి పేరు, అన్న పేరు, తమ్ముడు పేరు, తల్లి పేరు అంటూ వారి యొక్క బంధువుల పేర్లు పెట్టుకున్నారు తప్ప దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఎంతోమంది త్యాగమూర్తులు ఉన్నా మన దేశంలో ఏ ఒక్కరి పేరు పెట్టకపోవడం బాధాకరమైన విషయం అని, కానీ మన జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు మార్చి 14వ తారీకున జరిగిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభకు అమరజీవి పొట్టి శ్రీరాములు సభ ప్రాంగణంగా పేరు పెట్టడం అనేది దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమర వీరుల పూర్తితో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జనసేన పార్టీని ముందు తీసుకెళ్తున్నారు అంటూ డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మచ్చ శ్రీనివాస్, బండి వాసుబాబు, కంద చక్రబాబు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.