వంగవీటికి నివాళులు అర్పించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

  • వంగవీటి మోహన్ రంగా 34వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం: పేదల జీవితాల్లో వెలుగు నింపిన ఉషోదయం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం వంగవీటి మోహన రంగా 34వ వర్ధంతి సందర్భంగా కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామం నందు వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్. అనంతరం డాక్టర్ శ్రీధర్ పిల్లా మీడియాతో మాట్లాడుతూ వంగవీటి రంగా గారు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం వంగవీటి రంగా గారు ఆయన్ని ఆరోజు బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తూ సభ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడైతే మోహన్ రంగా గారికి మంచి పేరు వచ్చేస్తుంది అని, బడుగు బలహీన వర్గాల అండదండలతో మరింత బలమైన శక్తిగా ఎదుగుతాడని అదే సభలో కొంతమంది రౌడీలను పంపించి చంపించారు. కానీ ఇప్పుడు నవయువ మోహన్ రంగా మన పవన్ కళ్యాణ్ గారు అని ఒకప్పుడు రంగా గారిని పోగొట్టుకున్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వదులుకునే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కీ నిర్వహించిన ఇంకా ఏదైనా నిర్వహించిన గాని ఊరుకునే ప్రసక్తే లేదని, రాష్ట్రం అట్టుడికి పోతుందని దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వ వహించాల్సి వస్తుందని, రాబోయే 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చో పెడతామని దానికోసం మా ప్రాణాలు సైతం పణంగా పెడతామని డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్సకార నాయకులు కంబాల దాసు, గంధం గంగ, గవర రాంబాబు, ముమ్మిడి గంగ, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన్న దొర, జిలకర సత్యనారాయణ బిజెపి నాయకులు పిల్లా ముత్యాల రావు, మేడ సాని వరలక్ష్మి నారాయణ, సోదే రవికిరణ్, మెరుగు రవికుమార్, పలివెల్ల నానీబాబు, పెనుపోతుల వీరబాబు,
పల్లేటి జాన్సన్, మేడిశెట్టి దొరబాబు, అర్జీల్లి నాగేంద్ర మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.