బత్తుల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు

  • వైయస్సార్సీపి కి చెందిన పలువురు నేతలు, 200 మంది కార్యకర్తలు జనసేనలోకి బత్తుల ఆధ్వర్యంలో చేరిక

రాజానగరం నియోజకవర్గం: సీతారాంపురం గ్రామంలో వైయస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. ఆ గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు 200 మంది పైచిలుకు.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు, ఆయన రాజకీయ విలువలు, అలానే రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ సమర్థవంతమైన నాయకత్వం, ఆయన నిర్విరామంగా చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై.. గ్రామంలో వైఎస్ఆర్సిపికి చెందిన బలమైన రాజకీయ నేపధ్యం ఉన్న అడబాల రామ బాల సుబ్రహ్మణ్యం (లేటు) కుటుంబ సభ్యులు, వారి భార్య రమావతి, వారి కుమారుడు అడబాల వీర వెంకట సత్యనారాయణ (బాబి), వైసీపీ నాయకులు అడబాల రాజు, అడబాల నారాయణరావు, పంచాయతీ వార్డు మెంబర్ బత్తిన బాలాజీ, వైసిపి నాయకులు కందూరు రాజు, సేనాపతి రవి, సింగులూరి మణికంఠ, టిడిపి నేత కూరాకుల తాతయ్య, వైసిపి నాయకులు అడబాల లోవరాజు, అడబాల సత్తిబాబు, జుత్తుక శ్రీను, కొమ్మన దొరబాబు, వల్లూరి వీరయ్య, ఇందుగుమిల్లి సుధీర్, అమరశెట్టి దుర్గారావు, నూనె లచ్చన్న, ఈ నాయకుల అనుచరులు, ఇతర నాయకులు, కార్యకర్తలు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి, జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.. వారందరికీ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.. ఈ సందర్భాన్ని ఉద్దేశించి బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రం పూర్తిగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, అభివృద్ధి లేక అప్పులు మాయంగా మారి బ్రతుకుదెరువు కోసం పక్క రాష్ట్రాలకు, పక్కదేశాలకు వెళ్లిపోయే పరిస్థితి దాపురించిందని.. ఈ దుర్భర పరిస్థితి అధిగమించాలంటే నీతి నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వాలని.. అలానే తాను వ్యక్తిగతంగా పదవుల కోసమో, డబ్బు కోసమో, రాజకీయాల్లోకి రాలేదని పూర్తిగా ప్రజాసేవ చేయడానికి వచ్చానని.. తన జీవితం స్థానికుడిగా ఈ రాజానగరం నియోజకవర్గ ప్రజలకు అంకితమని.. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా తనను పిలవాలని.. దానికి తాను ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటానని చెబుతూ.. జనసేన పార్టీలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సమప్రధాన్యత ఉంటుందని.. పార్టీలో చేరే వారికి తగు రీతిలో సరైన గౌరవం కల్పించి, పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.. ఈ సందర్భంగా నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం అందరూ సమిష్టిగా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో సీతారాంపురం జనసేన నాయకులు అడబాల ఆది విష్ణు, వల్లభశెట్టి శంకరం, అడబాల జగ్గారావు, జాజుల ధర్మరాజు, పల్లపు చక్రం, అమరపల్లి శ్రీను, బొబ్బర అప్పన్న, గడ్డం పార్థసారథి, బొమ్మన దుర్గారావు, కూరాకుల వీర్రాజు, అడబాల శ్రీనివాస్, కుందూరి ఆనందరావు, మడక శివ, నియోజకవర్గ నాయకులు, సర్పంచులు కిమిడి శ్రీరామ, గళ్ళ రంగా, గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, వేగిశెట్టి రాజు, బోయిడి వెంకటేష్, దొడ్డి అప్పలరాజు, ఎక్స్ ఎంపీటీసీ భూషణం, చిక్కిరెడ్డి దొరబాబు, జోకా శేషగిరి, ముక్కపాటి గోపాలం, కానవరం సతీష్, రామకృష్ణ, పంతం సూరిబాబు, రామకృష్ణ, తోట అనిల్ వాసు, వీరమల్ల శ్రీను ఇతర నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, సీతారామపురం గ్రామపెద్దలు పెద్దఎత్తున పాల్గొని అత్యంత విజయవంతం చేశారు.